అర్థరాత్రి సడెన్‌గా, ఫామ్‌ హౌజ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పూజలు.. జనసేనానికి ఏమైంది? రీజన్‌ ఇదేనా?

Published : Dec 22, 2023, 07:37 PM IST

పవన్‌ కళ్యాణ్‌ అర్థరాత్రి సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆసక్తికరంగా మారింది. అయితే ఆయన సడెన్‌గా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

PREV
16
అర్థరాత్రి సడెన్‌గా, ఫామ్‌ హౌజ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పూజలు.. జనసేనానికి ఏమైంది? రీజన్‌ ఇదేనా?

పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు సినిమాలకు అనధికారికంగా గ్యాప్‌ ఇచ్చి పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్‌ పెట్టాడు. గత మూడు నాలుగు ఏళ్లుగా ఆయన రాజకీయాల్లోనే బిజీగా ఉన్నాడు. అదే సినిమాలు చేస్తే ఈ లోపు ఆయనది ఓ సినిమా రిలీజ్‌ అయ్యేది. కానీ కుదరడం లేదు. దీంతో `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇంకా ఐదు నెలలు ఆ సినిమా షూటింగ్‌లు ఆగిపోనున్నాయి. 
 

26

ఇదిలా ఉంటే పవన్‌ కళ్యాణ్‌ ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఆయన పోటీ చేయబోతున్నారు. ఈ సారైనా సీట్లు సంపాధించాలని, ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా ఆయన తనదైన ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీ, ఏపీలో అధికారంలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. ఛాన్స్ దొరికినప్పుడు జగన్‌ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. 

36

అయితే ఇటీవల పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆయన తన ఫామ్‌ హౌజ్‌లో సీక్రెట్‌గా పూజలు నిర్వహిస్తున్నారనే వార్త హాట్‌ టాపిక్‌ అవుతుంది. అది కూడా అర్థరాత్రి కావడం గమనార్హం. పవన్‌.. అర్థరాత్రి తన ఫామ్‌ హౌజ్‌లో పూజలు నిర్వహించడం ఆశ్చర్యపరుస్తుంది. దానికి కారణం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. 

46

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా పవన్‌ కళ్యాణ్‌ ఆరోగ్యం బాగా ఉండటం లేదట. ఆ మధ్య తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే తరచూ ఇలా అనారోగ్యానికి గురవుతున్నారట పవన్‌. ఏమాత్రం యాక్టివ్‌గా ఉండలేకపోతున్నాడట. మంచి ఎక్సర్‌సైజ్‌ లు చేయడం, బాడీని ఫిట్‌గా ఉంచుకోవడం, యోగా వంటివి చేస్తుంటాడు పవన్‌. హెల్త్ విషయంలో చాలా కేర్‌ తీసుకుంటారు. అందుకే తరగని గ్లామర్‌ ఆయన సొంతం. 
 

56

కానీ ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో జ్యోతిష్యుడుని సంప్రదించగా, తన జాతకంలో దోషం ఉందని, పూజలు చేయాలని సూచించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అర్థరాత్రి పూజలు నిర్వహించారట పవన్‌. అది ఆయన వ్యక్తిగత విషయం, పైగా అనారోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో పూర్తిగా ప్రైవేట్‌గా, ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాలి? నిజంగానే పవన్‌ పూజలు చేశాడా? లేక ఇవన్నీ ఉట్టి పుకార్లేనా? అనేది తెలియాల్సి ఉంది. 
 

66
Pawan kalyan OG Glimpse

సినిమాల పరంగా ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌.. `ఓజీ`, `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `హరి హర వీరమల్లు` చిత్రాల్లో నటిస్తున్నారు. `హరిహర వీరమల్లు` సినిమా ఆగిపోయింది. ఈ మూవీ ఉంటుందా? అనేది కూడా డౌటే. ఇక సుజీత్‌` రూపొందించే `ఓజీ` సగానికిపైగానే షూటింగ్‌ పూర్తయ్యింది. మరో పదిహేను రోజులు పవన్‌డేట్స్ ఇస్తే, మొదటిపార్ట్ పూర్తవుతుంది. అలాగే `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఒకటి రెండు షెడ్యూల్‌ అయ్యింది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. పవన్‌ ఇప్పట్లో రాడు అనే విషయం తెలిసిన దర్శకుడు హరీష్‌ శంకర్‌.. రవితేజతో సినిమాని ప్రకటించాడు. త్వరలోనే షూటింగ్‌ స్టార్ట్ కాబోతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories