పవన్‌ డెడికేషన్‌కి అంతా ఫిదా.. ఏకంగా ఉదయం ఏడుగంటలకే శిక్షణలో.. వైరల్‌

Published : Apr 02, 2021, 02:33 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమా పట్ల తనకున్న డెడికేషన్‌ని చూపిస్తున్నారు. ఆయన ఎర్లీమార్నింగ్‌ సినిమాకి కావాల్సిన యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఎంత డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నారో అనేదానికి ఈ ఫోటోలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.    

PREV
16
పవన్‌ డెడికేషన్‌కి అంతా ఫిదా.. ఏకంగా ఉదయం ఏడుగంటలకే శిక్షణలో.. వైరల్‌
పవన్‌ కళ్యాణ్‌ కరాటే వంటి యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం పొందారు. తన సినిమాల్లో చాలా వరకు ఆయా స్కిల్స్ ని, ఫైట్స్ ని చేసి చూపిస్తుంటారు. ప్రతి ఒక్కరు యుద్ధ విద్యల్లో పట్టు సాధించాలని, శరీరకంగా, మానసికంగా బలంగా ఉండేందుకు ఇవన్నీ దోహదం చేస్తాయని చెబుతుంటారు.

26
తాజాగా ఆయన తాను నటిస్తున్న `హరిహర వీరమల్లు` కోసం యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఉదయాన్నే ఏడుగంటల సమయంలో వాటిని సాధన చేస్తుండటం విశేషం. తాజాగా పవన్‌ సాధన చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది చిత్ర బృందం.

36
ఇందులో యుద్ధ విద్యలకు సంబంధించి ట్రైన్‌ అవుతున్న ఫోటోలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఉదయం 7 గంటలకు పవన్‌ ఇంత డెడికేటెడ్‌గా శిక్షణ తీసుకోవడం, సినిమా షూటింగ్‌కి ఆలస్యం కాకుండా ఎర్లీ మార్నింగ్‌ కసరత్తులు చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది.

46
షావోలిన్‌ వారియర్‌ మంక్‌ అకాడమీలో ఆయన శిక్షణ తీసుకుంటున్నారు. ట్రైనర్ హర్ష్‌ వర్మ శిక్షణ ఇస్తున్నారు. ఆయన కాస్ట్యూమ్‌ ధరించడానికి ముందే ఇలా అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్ లో భాగమయ్యారు. యాక్షన్‌ డైరెక్టర్‌ శ్యామ్‌ కౌశల్‌ పర్యవేక్షణలో ఈ సీక్వెన్స్ లో పవన్‌ పాల్గొన్నారు.

56
తాజా ఫోటోలు చూస్తుంటే సినిమా ఎంత గ్రాండియర్‌గా, యుద్ధ విధ్యలతో సాగుతుందో అర్థమవుతుంది. దీన్ని క్రిష్‌ రూపొందిస్తున్నారు. మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎంరత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది.

66
యుద్ధ వీరుడు వీరమల్లు పాత్ర ప్రధానంగా `హరిహర వీరమల్లు` చిత్రం రూపొందుతుంది. పవన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు. హిస్టారికల్‌గా యాక్షన్‌ డ్రామాగా సినిమా రూపొందుతుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories