అనసూయ వయసుపై హైపర్ ఆది పంచ్.. ముసలిదానివి అనడంతో మండిపోయిన యాంకర్

First Published Apr 2, 2021, 9:53 AM IST

జబర్దస్త్ లో హైపర్ అది పంచ్ ల పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆది నాన్ స్టాప్ పంచ్ లకి భారీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే అప్పుడప్పుడు ఆయన పంచ్ లు యాంకర్స్, జడ్జెస్ కి కూడా చెమటలు పట్టిస్తాయి.

తాజా ఎపిసోడ్ లో ఆది యాంకర్ అనసూయపై తన పంచ్ ల పవర్ చూపించాడు. ఏకంగా ముసలిదానివి అయిపోయావ్ అంటూ పరువే తీసేశాడు. ఇంతకీ ఏమి జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
undefined
ఈమధ్య ఆది స్కిట్స్ లో అనసూయ సైతం స్పెషల్ ఎంట్రీ ఇస్తుంది. ఒకటి రెండు నిముషాలు అలా కనిపించి మాయం అవుతుంది. తాజా ఎపిసోడ్ లో ఆది స్కిట్ లో చిన్న పాత్ర చేశారు అనసూయ.
undefined
నానమ్మ, తాతయ్య ఆడుకోవడానికి మనవడు కావాలని అంటున్నారని అనసూయ అనగా, అంత కోరికగా ఉంటే వాళ్లే ఓ అబ్బాయిని కని ఆడుకోమను, మనకు అంత సీన్ లేదు అని అన్నాడు ఆది.
undefined
ఆ తరువాత, ఈ మధ్య లోనలొటారం పైన పటారం అనే సాంగ్ చేశావ్.. అది నన్ను ఉద్దేశించేనా అని ఆది అనసూయను అడుగగా.. అయ్యో రామ మిమ్మల్ని అంత మాట అంటానా, అంటూ చెంపలు వేసుకుంది అనసూయ.
undefined
ఇక నన్ను చూస్తే నీకు ఏమి అనిపిస్తుంది అనసూయ.. అని హైపర్ ఆది అడుగగా,  మీరు ఎప్పటికీ ముసలోడు కాకూడదు.. అంటూ సిగ్గుపడింది. దీనికి ఆది.. నువ్వు మాత్రం ఆల్రెడీ ముసలిదానివి కావచ్చు, నేను కాకూడదా.. అంటూ పంచ్ విసిరాడు.
undefined
వేదికపై అందరి ముందు పంచ్ పేరుతో అనసూయను ముసలిది అనడంతో ఆమె షాక్ అయ్యింది. కోపంగా ఆదిని కొట్టడానికి ట్రై చేయగా.. దూరంగా పారిపోయాడు.
undefined
ఆది టైమింగ్ పంచ్ వేదికపై ఉన్న జడ్జిలతో పాటు అందరిచేత నవ్వులు పూయించింది.
undefined
ఇప్పటికే అనసూయ అంటే నచ్చని వాళ్ళు ఆంటీ అంటూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఆది కూడా ముసలావిడ  అని పిలవడంతో ఆమెకు షాక్ తగిలినట్లు అయ్యింది.
undefined
ఇక జబర్దస్త్ కొత్త జడ్జిగా హీరోయిన్ ఇంద్రజ అలరిస్తున్నారు. రోజా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ప్లేస్ లో ఇంద్రజ ఎంట్రీ ఇచ్చారు.
undefined
click me!