అన్నయ్య చిరంజీవి కోసం ఫైట్స్ కంపోజ్‌ చేసిన తమ్ముడు పవన్‌ .. రేర్‌ ఫోటో వైరల్‌..

First Published Jan 5, 2023, 1:05 PM IST

అన్నయ్య చిరంజీవి కోసం పవన్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా మారారు. ఓ సినిమాలో చిరంజీవికి పవర్‌ స్టార్‌ ఫైట్లు కంపోజ్‌ చేశారు. ఓ అరుదైన ఫోటో ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

చిరంజీవి నటుడిగా స్వయంకృషితో ఎదిగి టాలీవుడ్‌లో మెగాస్టార్ అయ్యారు. ఓ మహావృక్షంలా పెరిగి ఎంతో మందికి నీడనిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎదిగేలా ప్రత్యక్షంగా, పరోక్షంగా తనవంతూ సపోర్ట్ ని అందిస్తున్నారు. తన వారసత్వంగా వచ్చిన వారిలో పవన్‌ కళ్యాణ్ ఒకరని చెప్పొచ్చు. అన్న అడుగు జాడల్లో పెరిగి, హీరోగా ఎదిగి ఇప్పుడు పవర్‌స్టార్‌గా ఇండస్ట్రీని తన ఇమేజ్‌తో శాషించే స్థాయిలో ఎదిగారు పవన్‌. 

Pawan Kalyan

డాన్సుల్లో మెగాస్టార్‌ చిరంజీవిని మించే వారు లేదు. ఇప్పుడంటే బన్నీ, చరణ్‌, ఎన్టీఆర్‌ వంటి వాళ్లు డామినేట్‌ చేస్తున్నారుగానీ, పదేళ్లకి ముందు వరకు ఆయనకు ఆయనే సాటి. యాక్షన్‌ పరంగానూ చిరంజీవికి మంచి పేరుంది. ఆయన యాక్షన్‌ సినిమాలతోనే స్టార్‌గా ఎదిగారు. ఎన్నో సూపర్‌ హిట్లు అందుకున్నారు. అయితే చిరంజీవికి తమ్ముడు పవన్‌ ఫైట్లు కంపోజ్‌ చేయడం విశేషం. పవన్‌ తన సినిమాల్లో ఫైట్లు కంపోజ్‌ చేస్తుంటాడు, స్క్రిప్ట్ ల్లోనూ ఇన్ వాల్వ్ అవుతుంటాడు. కానీ అన్నయ్య కోసం యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా మారడం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. 
 

చిరంజీవికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో `డాడీ` ఒకటి. డాటర్‌ సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఇందులో డీసెంట్‌ ఫైట్స్ సీన్లు ఉంటాయి. వాటిని పవన్‌ కంపోజ్‌ చేయడం విశేషం. తాజాగా ఆ విషయం బయటకు వచ్చింది. ఫోటో వైరల్‌ అవుతుంది. `డాడీ` సినిమాలో చిరంజీవికి ఫైట్లు కంపోజ్‌ చేస్తూ కనిపించారు పవన్‌. ఇందులో ఆయన గుండుతో కనిపించడం మరో విశేషం.  
 

Pawan Kalyan

2001, అక్టోబర్‌ 4న `డాడీ` సినిమా విడుదలైంది. సురేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ నిర్మించారు. ఇందులో చిరుకి జోడీగా సిమ్రన్‌ నటించగా, కూతురు పాత్రలో అనుష్క మల్హోత్రా నటించి మెప్పించింది. ఇందులో అన్నయ్య చిరంజీవికి పవన్‌ ఫైట్స్ కంపోజ్‌ చేశారనే విసయం ఇప్పుడు అటు మెగాస్టార్‌, ఇటు పవర్‌ స్టార్‌ అభిమానులను ఖుషీ చేస్తుంది. 
 

ఇదిలా ఉంటే ఈ సినిమాని తనకంటే వెంకటేష్‌కే బాగా సూట్‌ అవుతుందన్నారు చిరంజీవి. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. రైటర్‌ భూపతి రాజాకి ఈ విషయం చెప్పగా, ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేలా ఉంటుందని, వెరైటీగా ఉంటుందని చెప్పారట. వారి ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చిందన్నారు చిరు. అయితే సినిమా రిలీజ్‌ తర్వాత వెంకటేష్‌ ఫోన్‌ చేస్తూ `భలే సినిమా అండీ.. నేను చేస్తే బాగుండేది` అని చెప్పారట. తను కూడా టీమ్‌తో అన్నానని, కానీ వినలేదని చెప్పాడట చిరు. 

ప్రస్తుతం చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య` చిత్రంలో నటించారు. ఇది సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదల కాబోతుంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా, ప్రధానంగా రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్‌ చేశారు. మరోవైపు  పవన్‌ ప్రస్తుతం `హరి హరవీరమల్లు` చిత్రంలో నటిస్తున్నారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. క్రిష్‌ దర్శకుడు. 
 

click me!