బిగ్ బాస్ భామతో దుబాయ్ చెక్కేసిన జబర్దస్త్ కమెడియన్... రాకింగ్ రాకేష్-సుజాత రొమాంటిక్ ఫోటోలు వైరల్ 

Published : Jan 05, 2023, 12:56 PM ISTUpdated : Jan 05, 2023, 01:13 PM IST

ప్రియురాలు అడిగితే ఆకాశంలో చందమామ, మెరిసే తారలు కూడా తెచ్చి ఇచ్చేస్తారు ప్రేమికులు. అలాంటిది ఆఫ్ట్రాల్ దుబాయ్ తీసుకెళ్ల లేరా?. రాకింగ్ రాకేష్ అదే చేశాడు. తన ప్రేయసి బర్త్ డే వేడుకలు దుబాయ్ లో ప్లాన్ చేశాడు.   

PREV
17
బిగ్ బాస్ భామతో దుబాయ్ చెక్కేసిన జబర్దస్త్ కమెడియన్... రాకింగ్ రాకేష్-సుజాత రొమాంటిక్ ఫోటోలు వైరల్ 
Rocking Rakesh

సుజాత పుట్టినరోజు వేడుకలు రాకేష్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక కోసం రాకేష్-సుజాత జంట దుబాయ్ వెళ్లారు. లగ్జరీ నగరంలో ప్రియురాలి జన్మదిన వేడుకలు రాకేష్ ప్రత్యేకంగా జరిపారు.  కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆలింగనం చేసుకొని ప్రేమను చాటుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో రాకింగ్ రాకేష్ సన్నిహితులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది.

27
Rocking Rakesh

రాకింగ్ రాకేష్ లవర్ సుజాత బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీంతో అవి వైరల్ గా మారాయి. రాకింగ్ రాకేష్ ఫ్యాన్స్... సుజాతకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. మీ జంట ముచ్చటగా ఉంది, కలకాలం కలిసి జీవించాలని ఆశీర్వదిస్తున్నారు.

37
Rocking Rakesh

రాకింగ్ రాకేష్-జోర్దార్ సుజాత ప్రేమించుకుంటున్న సంగతి  తెలిసిందే. జబర్దస్త్ వేదికగా వీరి ప్రేమ చిగురించింది. ఇతర ప్రేమకథల మాదిరి వీరిది కూడా ఉత్తుత్తి ప్రేమ అనుకున్నారు. ఓ టెలివిజన్ షోలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతకు అందరి ముందు ప్రపోజ్ చేశాడు. జోర్దార్ షోతో ఫేమస్ అయిన సుజాత బిగ్ సీజన్ 4లో పాల్గొన్నారు. హోస్ట్ నాగార్జునను సుజాత బిట్టు అని పిలిచేది. ఆ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండగా సుజాత జర్నీ ఎక్కువ వారాలు సాగలేదు.

47
Rocking Rakesh

అయితే బిగ్ బాస్ షో అనంతరం ఆమెకు బుల్లితెర ఆఫర్స్ పెరిగాయి. అలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే రాకేష్-సుజాత మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్ళుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. త్వరలో అధికారికంగా వివాహం చేసుకోనున్నారు. ఇక సుజాతతో పెళ్ళికి రాకేష్ మదర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే... ఆమె సుజాత విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు. రాకేష్ అసలు వివాహం చేసుకోను అన్నాడట. 
 

57
Rocking Rakesh

తమ్ముడికేమో పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట. బంధువులు అందరూ రాకింగ్ రాకేష్ వివాహం ఎప్పుడని అడుగుతుంటే ఆమెకు చాలా ఇబ్బందిగా ఉండేదట.సుజాత కారణంగా రాకేష్ వివాహానికి ఒప్పుకోవడం సంతోషకర విషయం అని తల్లి అన్నారు. అలాగే సుజాతపై ఆమె ప్రశంసలు కురిపించారు.
 

67
Rocking Rakesh

సుజాత వచ్చాక ఇల్లు సందడిగా మారింది. గలగలా మాట్లాడే సుజాత మా ఇంట్లో మరో చిన్నారి అయ్యిందంటూ కాబోయే కోడలిపై ప్రేమ కురిపించింది. పెళ్లికాకుండానే రాకింగ్ రాకేష్ ఇంట్లో సభ్యురాలు అయ్యింది సుజాత.

77
Rocking Rakesh


ఇక రాకింగ్ రాకేష్ చిన్న పిల్లల స్కిట్స్ కి ఫేమస్. మామూలు కమెడియన్ గా వచ్చి రాకేష్ టీమ్ లీడర్ అయ్యాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో ఉన్న సీనియర్ కమెడియన్స్ లో రాకింగ్ రాకేష్ ఒకరు. ఆడపడపాదడపా సినిమాల్లో కూడా రాకింగ్ రాకేష్ నటిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories