అయితే ఒక్క సారి మాత్రం అజిత్ తన కుటుంబానికి.. తన ప్రేమకు సబంధించిన విషయాన్ని పంచుకున్నారు. 2007లో, అజిత్ కుమార్ తన ప్రేమ కథ మరియు షాలినితో వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అజిత్ మాట్లాడుతూ, తాను మొదట శాలినితో కలిసి అమర్కలం (1999)లో పనిచేశానని, అప్పుడే తాము ప్రేమలో పడ్డామని చెప్పాడు. షాలిని అందం, గ్రేస్ చూసి ఆశ్చర్యపోయిన అజిత్.. ఇది తనకు 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అని అన్నారు.