Dhanush-Aishwarya Divorce: ధనుష్ విషయంలో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య.. నిరాశలో అభిమానులు

Published : Mar 24, 2022, 05:46 PM IST

మరో సారి సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు తమిళ స్టార్ జంట ఐశ్వర్య, ధనుష్. వీళ్లు మళ్ళీ కలుస్తారు అని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న అభిమానులకు షాక్ ఇచ్చింది ఐశ్వర్య. 

PREV
17
Dhanush-Aishwarya Divorce: ధనుష్ విషయంలో క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య..  నిరాశలో అభిమానులు

రజనీకాంత్ పెద్ద కుమార్తె.. స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య  మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యనే ఐశ్వర్య, ధనుష్ విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి డివోర్స్ అభిమానులకు ఊహించని షాక్  తగిలింది. అయితే అభిమానుల్లో మాత్రం వీళ్లిద్దరు మళ్ళీ కలుస్తారన్న ఆశలున్నాయి.  

27

18 ఏళ్ల పాటు అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ఈ ఏడాది జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే అవి మామూలు గొడవలేనని, మళ్లీ కలిసిపోతారంటూ ధనుష్‌ తండ్రి స్టేట్ మెంట్తో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. పైగా విడాకుల ప్రకటన తర్వాత కూడా వీళ్ళిద్దరు కలిసి తిరుగుతున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. 

37

ఇక ఇటీవల ఆమె డైరెక్ట్‌ చేసిన సాంగ్‌ రిలీజ్‌ చేసిన సమయంలో ఐశ్వర్యను స్నేహితురాలు అని ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు ధనుష్‌. దీంతో వీళ్లు మళ్లీ కలిసే సూచనలున్నాయని అభిమానులు  అభిప్రాయాపడ్డారు. ఇద్దరినీ కలిపేందుకు ఐశ్వర్య తండ్రి తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఎంతో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదని సమాచారం. 
 

47

రజనీకాంత్ అభిమానులు కూడా ఈ విడాకుల పట్ల చాలా ద్భాల్లో అసహనం వ్యక్తం చేశారు. అయితే ప్రకటన తర్వాత కూడా వీరి కుటుంబ సభ్యులు రాజీ ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వచ్చాయి. రజనీకాంత్ ధనుష్ ఫ్యామిలీ అంతా కలిసి ఈ ప్రయత్నంలో బాగంగా హైద్రాబాద్ లో ఓ లగ్జరీ హోటల్ లో పార్టీ కూడా చేసుకున్నారు. ఈ వేడుకలో ధనుష్, ఐశ్వర్య కూడా పాల్గొన్నారు. 
 

57

ఇక రీసెంట్ గా ఐశ్వర్య తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది. ట్విట్టర్ ఖాతాలో ఇన్నాళ్లు తన పేరు వెనుక పెట్టుకున్న ధనుష్ ను ఐశ్వర్య తొలగించింది. తన పేరు చివరన తన తండ్రి రజనీకాంత్ పేరును పెట్టుకుంది. దీంతో, ఇకపై ధనుష్ ను మళ్లీ కలిసే అవకాశమే లేదని ఆమె స్పష్టంగా చెప్పకనే చెప్పింది. 

67

విడాకులు తరువాత ఐశ్వర్య తన దృష్టి కంప్లీట్ గా సినిమాలపైన పెట్టబోతుంది. రీసెంట్ గా  బాలీవుడ్ లో ఒక  సినిమాను డైరెక్ట్ చేసు ఛాన్స్ వచ్చినట్టు  ఐశ్వర్య ప్రకటించింది. ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా పేరు కూడా ప్రకటిచింది. ఓ సాథీ చల్ టైటిల్ తో.. యదార్థ సంఘటనల ఆధారంగా.. ప్రేమకథతో ఈసినిమా తెరకెక్కబోతున్నట్లు ఐశ్వర్య తెలిపింది. 
 

77

ఐశ్వర్య, ధనుష్ విడాకుల వల్ల అభిమానులు బాధపడుతున్నారు కాని.. ఈ జంట మాత్రం ఎప్పటిలాగానే హ్యాపీగా ఎవరిపని వార చేసుకుంటున్నారు. ఈ విషయంలో రజనీకాంత్ ప్రయత్నాలు కూడా విఫలం అవ్వడంతో.. ఆయన కూడా బాలో ఉన్నట్టు సమాచారం. కాగా దనుష్, ఐశ్వర్యలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories