Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ లవ్ స్టోరీ మూవీస్.. అన్నింటికంటే హైలైట్ అదే, తొలిప్రేమ కాదు

Published : Nov 10, 2026, 10:03 AM IST

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో కొన్ని లవ్ స్టోరీ మూవీస్ లో నటించారు. వాటిలో తొలి ప్రేమ, ఖుషి లాంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఆ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

PREV
17
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లోకెక్కారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాత్రమే కాకుండా ఆయన చేసిన సినిమాలు, ప్రేమ కథా చిత్రాల గురించి కూడా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తన కెరీర్ బిగినింగ్ లో వరుసగా లవ్ స్టోరీ మూవీస్ చేశారు. వాటిలో చాలా చిత్రాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఆ చిత్రాల్లో బాగా హైలైట్ అయిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

27
తొలిప్రేమ

కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పవన్ కెరీర్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కీర్తి రెడ్డి ఈ చిత్రంలో హీరోయిన్. అద్భుతమైన ప్రేమ కథతో పాటు యువతకు చిన్నపాటి సందేశాన్ని ఇస్తూ ఈ చిత్రం ఉంటుంది. అందుకే ఈ చిత్రం ఏకంగా 6 నంది అవార్డులు, ఒక నేషనల్ అవార్డు గెలుచుకుంది.

37
బద్రి

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తొలి చిత్రం ఇదే. ఈ మూవీ పవన్ మ్యానరిజమ్స్ ఆడియన్స్ ని పిచ్చెక్కించాయి. ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ ఆమెతో ఛాలెంజ్ చేసి మరో అమ్మాయిని ప్రేమలోకి దించడం ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది. పవన్, ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ కి బాగా నచ్చేశాయి.

47
ఖుషి

యువతని ఉర్రూతలూగించి ఈ ప్రేమ కథా చిత్రంలో పవన్, భూమిక జంటగా నటించారు. ఈ మూవీలో పవన్, భూమిక మధ్య కెమిస్ట్రీ గురించి అభిమానులు దశాబ్దాల తర్వాత కూడా చెప్పుకుంటూనే ఉన్నారు. ఎస్ జె సూర్య ఈ చిత్రానికి దర్శకుడు. ప్రేమికుల మధ్య వచ్చిన ఇగో బాగా ముదిరి ఇంకా బలమైన ప్రేమగా ఎలా మారింది అనే అంశాన్ని అద్భుతంగా చూపించారు.

57
సుస్వాగతం

పవన్ కళ్యాణ్ నటించిన ప్రేమ కథా చిత్రాల్లో డిఫెరెంట్ మూవీ అంటే సుస్వాగతం అనే చెప్పొచ్చు. ఎమోషనల్ గా సాగే ఈ లవ్ డ్రామాలో పవన్, దేవయాని జంటగా నటించారు. ప్రేమ కోసం అమ్మాయి వెంట పడడం, ఆమె తండ్రి తో దెబ్బలు తినడం అంతా రొటీన్ గా అనిపించినా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంది. క్లైమాక్స్ అసలైన హైలైట్. అప్పటి వరకు ప్రేమ కోసం హీరోయిన్ వెంట పడ్డ హీరో.. క్లైమాక్స్ లో ఆమె అంతట ఆమే కోరి వచ్చినప్పుడు రిజెక్ట్ చేస్తాడు. ఎస్ జె రాజ్ కుమార్ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది.

67
గోకులంలో సీత

రాసి, పవన్ జంటగా నటించిన ఈ చిత్రం ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కింది. ఇది కూడా ఎమోషనల్ గా సాగే లవ్ డ్రామా. శ్రీహరి, కోట శ్రీనివాసరావు, సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు.

77
ఇతర చిత్రాలు

ఇవి కాకుండా పవన్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తీన్మార్, గుడుంబా శంకర్ లాంటి లవ్ స్టోరీ చిత్రాలు కూడా చేశారు. ఆ తర్వాత బలమైన మాస్ ఇమేజ్ కారణంగా పవన్ మాస్ చిత్రాలు చేయడం ప్రారంభించారు.

Read more Photos on
click me!

Recommended Stories