ఇంటర్ లోనే ఎదురింటి అబ్బాయికి లైన్ వేసిన నదియా... ఈ సీరియస్ అత్తకు ఇంత రొమాంటిక్ లవ్ స్టోరీ ఉందా?

Published : Jun 26, 2022, 09:03 AM IST

హుందాతనంతో కూడిన స్టైలిష్, మోడ్రన్ అమ్మ, అత్త పాత్రలకు నదియా కేరాఫ్ అడ్రెస్. ఓ తరహా పాత్రలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్. మిర్చీ, అత్తారింటికి దారేది చిత్రాలతో తెలుగులో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నదియా ఇంటర్ లోనే లవ్ లో పడ్డారట. ఆమె రియల్ లైఫ్ లవ్ స్టోరీ విన్న ప్రేక్షకులు.. తెరపై ఇంత సీరియస్ గా కనిపించే నదియాకు ఇంత రొమాంటిక్ లవ్ స్టోరీ ఉందా! అంటూ ఆశ్చర్యపోతున్నారు.

PREV
18
ఇంటర్ లోనే ఎదురింటి అబ్బాయికి లైన్ వేసిన నదియా... ఈ సీరియస్ అత్తకు ఇంత రొమాంటిక్ లవ్ స్టోరీ ఉందా?
Nadiya

తన జీవితంలో ఏది ప్రణాళిక ప్రకారం జరగలేదంటారు నటి నదియా(Nadiya). హీరోయిన్ కావడం కూడా యాదృచ్చికంగా జరిగిందే. మలయాళ దర్శకుడు ఫాజిల్ నటి నదియా ఫ్యామిలీ ఫ్రెండ్. ఓ సారి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నదియాను చూశారట. తర్వాత మోహన్ లాల్ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. మీ అమ్మాయి ఆ పాత్రకు సరిపోతుందనిపిస్తుంది, ఆడిషన్స్ కి తీసుకొస్తారా? అని ఫాజిల్ అడిగారట.

28
Nadiya

నదియా నాన్నగారు ఆమెను ఒప్పించి ఆడిషన్స్ కి తీసుకెళ్లారట. ఆ మూవీ హీరోయిన్ గా నదియా ఎంపికయ్యారు. 1984లో విడుదలైన మలయాళ చిత్రం నొక్కేతధూరతు కన్నుం నట్టు సూపర్ హిట్ కావడంతో నదియా ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆ చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. దీంతో మలయాళ, తమిళ భాషల్లో ఆఫర్స్ క్యూ కట్టాయి. 
 

38
Nadiya

నదియా కోరుకుంది మాత్రం ఎంబీఏ చేసి యాడ్ మేకర్ కావాలని. చిన్నతనంలో ఆమె టీవీలో వచ్చే ప్రకటనలు చాలా ఆసక్తిగా చూసేవారట. పెద్దయ్యాక తాను కూడా అలాంటి ప్రకటనలు రూపొందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే శిరీష్ గాడ్బోలే పరిచయంతో అన్నీ మారిపోయాయి. ఇంటర్ చదువుతున్న రోజుల్లో ఇంటికెదురుగా ఉండే శిరీష్ అంటే నదియా ఇష్టపడ్డారట.

48
Nadiya

ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే శిరీష్ లక్ష్యం చదువు పూర్తి చేసి విదేశాల్లో స్థిరపడాలి. అందుకోసం నదియా తన లక్ష్యం త్యాగం చేసిందట. శిరీష్ ఉద్యోగంలో స్థిరపడ్డాక పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనేది నదియా ఆలోచన. శిరీష్ అమెరికా వెళ్ళాక, నదియా ఇండియాలో హీరోయిన్ గా బిజీ అయ్యారట.

58
Nadiya

అప్పట్లో విదేశాల్లో ఉన్నవారితో మాట్లాడాలంటే సోషల్ మీడియా, సెల్ ఫోన్ లాంటి సౌకర్యాలు లేవు. టెలిగ్రామ్ రాయడం లేదంటే ట్రంక్ కాల్ బుక్ చేసుకోవాలి. షూటింగ్స్ వలన ఆయనతో మాట్లాడటం కుదిరేది కాదట. ఫైనల్ గా శిరీష్ కి అమెరికాలో ఉద్యోగం రావడంతో ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పి పెళ్ళికి ఒప్పించారు. 1988లో శిరీష్-నదియా వివాహం జరిగింది. 
 

68
Nadiya

శిరీష్ తో పెళ్లి కుదిరాక సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మైనే ప్యార్ కియా చిత్రంలో అవకాశం వచ్చిందట. మంచి ఆఫర్... చేయాలా? వద్దా? అనే సందిగ్ధత ఏర్పడింది. పెళ్లి మేటర్ ఏదైనా తేడా కొడితే పరిస్థితులు దారుణంగా మారతాయని, నదియా చేయనని చెప్పేశారట. మైనే ప్యార్ కియా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే. పెళ్లి తర్వాత అప్పటి వరకు ఒప్పుకున్న చిత్రాలు పూర్తి చేసి భర్తతో పాటు అమెరికా వెళ్ళిపోయింది నదియా.

78
Nadiya


సనమ్, జన అనే ఇద్దరు అమ్మాయిలకు నదియా తల్లయ్యారు. సినిమా జీవితం పూర్తిగా వదిలేసిన నదియాకు దర్శకుడు ఎం రాజా అమ్మానాన్న తమిళ అమ్మాయి తమిళ్ రీమేక్ లో జయసుధ పాత్ర ఆఫర్ చేశారు. అదే విషయాన్ని భర్తకు చెప్పగా...   నా కోసం నువ్వు చాలా త్యాగం చేశావు. ఇకపై నీకు ఇష్టమైన సినిమాల్లో నటించమని అనుమతి ఇచ్చారట. అలా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. 
 

88
Nadiya


తెలుగులో హీరోయిన్ గా బజార్ రౌడీ, ఓ తండ్రి ఓ కూతురు చిత్రాలు చేసిన నదియా.. మిర్చి మూవీలో ప్రభాస్ తల్లి పాత్ర చేశారు. ఇక అత్తారింటికి దారేది చిత్రంలో అత్తగా పవర్ ఫుల్ పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నదియా తెలుగులో ఎక్కువగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన గని, సర్కారు వారి పాట, అంటే సుందరానికీ చిత్రాల్లో నదియా నటించారు. రామ్ పోతినేని ది వారియర్ మూవీలో నదియా కీలక రోల్ చేస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories