పెళ్ళైనా అసలు తగ్గని నిహారిక...  ఆ కోరిక తీర్చుకోవడం కోసమేనా ఈ సూపర్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్?

Published : Jun 26, 2022, 06:42 AM IST

మెగా ఫ్యామిలీలో పుట్టడం అబ్బాయిల అదృష్టం. ఈజీగా హీరో అయిపోవచ్చు.  ఏమాత్రం టాలెంట్ ఉన్నా స్టార్ హోదా పట్టేయొచ్చు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ని కూడా కలుపుకుంటే నలుగురు స్టార్ హీరోలు ఉన్నారు. ఇద్దరు టూ టైర్ హీరోలు ఉన్నారు. మరో ముగ్గురు ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు.

PREV
17
పెళ్ళైనా అసలు తగ్గని నిహారిక...  ఆ కోరిక తీర్చుకోవడం కోసమేనా ఈ సూపర్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్?
Niharika Konidela

మెగా ఫ్యామిలీకి ఉన్న భారీ ఫ్యాన్ బేస్ వాళ్ళ ఎదుగుదలకు పరోక్షంగా ఊతం ఇస్తుంది అనడంలో సందేహం లేదు. మెగా హీరో కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి అంటే చాలు ఆటోమేటిక్ గా ఆదరించే అభిమానులు ఉన్నారు. ఈ సప్పోర్ట్ అబ్బాయిల వరకే. అమ్మాయిలకు ఉండదు. కారణం... పరిశ్రమలో హీరోయిన్స్ పట్ల తప్పుడు అభిప్రాయాలు, చిన్న చూపు ఉంటుంది. 
 

27
Niharika Konidela

ఆ కారణంగా తమ అభిమాన ఫ్యామిలీ నుండి ఓ అమ్మాయి హీరోయిన్ కావడమంటే వాళ్ళ పరువు పోతున్నట్లు ఫీల్ అవుతున్నారు. నాగబాబు (Nagababu)కూతురు మెగా ఫ్యాన్స్ కి ఇష్టం లేకుండానే పరిశ్రమలో అడుగు పెట్టింది. ఆమెకు ఫ్యామిలీ నుండి ఫ్యాన్స్ నుండి మద్దతు లభించలేదు. ఈ కారణంగా  నిలదొక్కుకోలేకపోయింది. 
 

37
Niharika Konidela


ఫెయిల్యూర్ సాకు చూపి నిహారిక(Nihairka Konidela)కు త్వరత్వరగా వివాహం చేసేశారు. ఆమె మాత్రం హీరోయిన్ గా ఎదగాలని ఆశపడ్డారు. ఒక మనసు చిత్రంలో నిహారిక వెండితెరకు పరిచయమయ్యారు. తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించారు. ఇవేమీ ఆశించిన విజయం సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద కనీస వసూళ్లు అందుకోలేకపోయాయి. 
 

47
Niharika Konidela

2020 డిసెంబర్ లో నిహారిక వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం జొన్నలగడ్డ వెంకట చైతన్యతో ఆమె వివాహం ఘనంగా నిర్వహించారు. పెళ్ళైనా హీరోయిన్ గా ఎదగాలనే ఆమె కోరిక చావలేదు. భర్త, అత్తింటివారి అనుమతితో నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

57
Niharika Konidela


దీని కోసమే ఆమె స్టైలిష్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. నిహారిక ఇంస్టాగ్రామ్ లో వరుస ఫోటో షూట్స్ చేయడంతో పాటు సదరు ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఆ విధంగా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మధ్య నిహారిక తన అకౌంట్ ని డియాక్టివేట్ చేసింది. దాదాపు ఓ నెల రోజుల తర్వాత తిరిగి అకౌంట్ చలామణిలోకి తెచ్చింది. 

67
Niharika Konidela


ప్రస్తుతం ఆమె ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నట్లు సమాచారం. అనసూయ కూడా ఈ సిరీస్లో కీలక రోల్ చేస్తున్నారు. ఇది ప్రకటించి చాలా కాలం అవుతున్నా మరో అప్డేట్ లేదు. ఇక నిహారికకు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ఓ బ్యానర్ ఉంది.ఈ బ్యానర్ లో ఆమె కొన్ని వెబ్ సిరీస్లు నిర్మించడం జరిగింది. తాజాగా ఆమె మరికొన్ని చిత్రాలు, సిరీస్లు తెరకెక్కించే ఆలోచన చేస్తున్నారు. 
 

77
Niharika Konidela

నటిగా ఎదగాలి అనేది ఆమె అసలు కోరిక. ఆ దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు. ఈ మధ్య నిహారిక కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. లేట్ నైట్ పార్టీలో నిహారిక పాల్గొన్నారు. ఆమె పార్టీ జరుపుకుంటున్న పబ్ పై పోలీసులు దాడి చేసి 50 మంది యువతీయువకులను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. వాళ్లలో నిహారిక కూడా ఉన్నారు. ఆ పబ్ లో డ్రగ్స్ వినియోగించినట్లు తెలియగా, నిహారికకు మాత్రం క్లీన్ చిట్ వచ్చింది.

click me!

Recommended Stories