ముఖ్యంగా పూరి(Puri jagannadh) వ్యక్తిగత జీవితాన్ని టచ్ చేయడంతో పాటు, ఆయన భార్యా, కొడుకును గాలికి వదిలేశాడన్నట్లు మాట్లాడాడు. పూరి భార్య లావణ్యను పొగిడే క్రమంలో ఛార్మికి చురకలు వేశాడు. నీ జేబులో వంద రూపాయలు లేనప్పుడు లావణ్య వదిన మిమ్మల్ని నమ్మి మీతో వచ్చారు. మీరు స్టార్ డైరెక్టర్ అయ్యాక ర్యాంప్ లు వ్యాంపులు వచ్చాయి, అన్నాడు. ఈ డైలాగ్ ఛార్మిని (Charmi)టార్గెట్ చేస్తూ అన్నట్లుంది.