సీఎంగా పవన్‌ కళ్యాణ్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్‌, మరి చంద్రబాబు?.. టీడీపీ, జనసేన మధ్య ముదురుతున్న వార్?

Published : Jan 19, 2025, 04:11 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ త్వరలో సీఎం కాబోతున్నాడా? చంద్రబాబు స్థానంలో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారా? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌.   

PREV
17
సీఎంగా పవన్‌ కళ్యాణ్‌, డిప్యూటీ సీఎంగా లోకేష్‌, మరి చంద్రబాబు?.. టీడీపీ, జనసేన మధ్య ముదురుతున్న వార్?

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఆయన త్వరలో సీఎం కాబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. చంద్రబాబు నాయుడు స్థానంలో పవన్‌ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారని, చంద్రబాబు తన సీఎం పదవి వదులుకుంటున్నారని, ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని, దీంతో సీఎంగా పవన్‌ కళ్యాణ్‌ ని నియమించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

అదే సమయంలో డిప్యూటీ సీఎంగా లోకేష్‌ని ఎన్నుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్‌ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు నిజంగానే సీఎం పదవి నుంచి తప్పుకుంటాడా?  పవన్‌ సీఎం కాబోతున్నాడా? ఈ వార్తలకు కారణమేంటి? టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో ఇప్పుడిది పెద్ద రచ్చ అవుతుంది. 
 

27

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌  తన జనసేన పార్టీ నుంచి 21 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుని టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు సీఎంగా, పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నారా లోకేష్‌ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ క్రమంలో ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు పవన్‌. డిప్యూటీ సీఎంగా తిరుగులేని పవర్స్ తో తనవంతు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. మాట ఇచ్చినట్టుగానే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ దూసుకుపోతున్నారు. 
 

37

ఆయన మూడు సినిమాలు చేయాల్సి ఉన్నా, వాటికంటే డిప్యూటీ సీఎంగా ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు.  చంద్రబాబు సీఎంగా ఉన్నా, పవన్‌ తన మార్క్ ని చూపిస్తున్నారు.

స్వతహాగా నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. ఈ విషయంలో పవన్‌ కళ్యాణ్‌కి కూడా ఫ్రీడమ్‌ ఇస్తున్నారు చంద్రబాబు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా రన్‌ అవుతుంది. 
read  more: ఎన్టీఆర్‌ పిల్లల కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నాడా? మరణానికి కారణమదేనా? సంచలన నిజాలు బయటపెట్టిన హరికృష్ణ

47

అయితే గ్రామాల స్థాయిలో, మండలాలు, నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అధికారం, డామినేషన్‌ విషయంలో రెండు వర్గాల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ఘర్షణల వరకు వెళ్తున్నాయి. కానీ ఇప్పుడు అవి పై స్థాయిలో ప్రారంభమవుతున్నాయి.

ప్రభుత్వం స్థాయిలో రెండు పార్టీ శ్రేణులు, నాయకుల మధ్య డామినేషన్‌ ప్రభావం కనిపిస్తుంది. తాజాగా టీడీపీ శ్రేణులు లేవనెత్తిన విషయం వివాదంగా మారుతుంది. రెండు పార్టీ మధ్య, కూటమి ప్రభుత్వంలో చిచ్చుకు కారణమవుతుంది. రెండు పార్టీల స్నేహానికి భీటలు పారేందుకు దోహదపడుతుంది. 
 

57

అందుకు కారణం చూస్తే, నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ టీడీపీ శ్రేణుల నుంచి రావడమే. చంద్రబాబు సీఎంగా ఉండాలని, పవన్‌కి ప్రత్యేక గౌరవం ఇవ్వాలని ఆయన్ని ఒక్కరినే డిప్యూటీ సీఎం చేశారు. కానీ ఇప్పుడు టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్‌ని బహిరంగంగానే వెల్లడించారు.

స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజు సైతం ఇదే చెప్పారు. లోకేష్‌ డిప్యూటీ సీఎం కావాలని తాను కూడా కోరుకుంటానని తెలిపారు. దీంతో ఈ డిమాండే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమవుతుంది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో జనసేన కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు రెచ్చిపోతున్నారు. కౌంటర్లతో టీడీపీని ఆడుకుంటున్నారు. 
 

67

అందులో భాగంగానే సీఎంగా పవన్‌ కళ్యాణ్‌ అంటూ యాష్‌ ట్యాగ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. నారా లోకేష్‌ డిప్యూటీ సీఎం అయితే పవన్‌ కళ్యాణ్‌ సీఎం అవుతాడని అంటున్నారు. ఇక ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నర్‌గానో, లేదంటే ఉపరాష్ట్రపతిగానో వెళ్లిపోతారని అంటున్నారు. పవన్‌ అభిమానులు ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి నారా లోకేష్‌కి, ఆయన్ని సపోర్ట్ చేసేవారిని కౌంటర్లు వేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా మంచి హుందాతనంతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, కానీ ఇప్పుడు పవన్‌ని తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుందని జనసేన అభిమానుల వాపోతున్నారు. ఇది పవన్‌పై జరుగుతున్న కుట్రగా వారు అభిప్రాయపడుతున్నారు.
 

77

అందుకే నారా లోకేష్‌ ఫ్యాన్స్ కి, టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు దిమ్మతిరిగే కౌంటర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో అటు టీడీపీ, ఇటు జనసేన కార్యకర్తల మధ్య వివాదం ముదురుతుంది. ఇది ఇలానే కొనసాగితే నిజంగానే ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారబోతాయని? చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి దీనిపై అటు చంద్రబాబు, లోకేష్‌, ఇటు పవన్‌ కల్యాణ్‌ ఈ వివాదానికి ఎలా చెక్ పెడతారో చూడాలి. 

read  more: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని కళ్లు తెరిచేలోపలే చిదిమేస్తున్నారు.. చిరంజీవి, థమన్‌ మధ్య ఎమోషనల్ కన్వర్జేషన్‌

also read: `డాకు మహారాజ్‌`, `సంక్రాంతికి వస్తున్నాం` కలెక్షన్లు.. బాక్సాఫీసు వద్ద బాలయ్య, వెంకీ మధ్య తీవ్ర పోటీ

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories