`ఓజీ`లో పవన్‌ కళ్యాణ్‌ మూడు వేరియేషన్స్.. అసలు మ్యాటర్‌ లీక్‌ చేసిన `రజాకార్‌` నటుడు.. ఫ్యాన్స్ ఊగిపోవడమే!

First Published Mar 23, 2024, 2:24 PM IST

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో `ఓజీ` ముందుగా విడుదల కాబోతుంది. తాజాగా ఇందులోని పవన్‌ కళ్యాణ్‌ పాత్రని లీక్‌ చేశాడు `రజాకార్‌` నటుడు. 

Pawan kalyan OG Glimpse

పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో `ఓజీ` మెయిన్‌గా ఉంది. ఇదే ముందుగా రిలీజ్‌ కాబోతుంది. ముంబయి బేస్డ్ గ్యాంగ్‌స్టర్‌ ప్రధానంగా ఈ మూవీ సాగుతుందని తెలుస్తుంది. విడుదలైన `గ్లింప్స్` కూడా అలాంటి హింటే ఇచ్చింది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

Pawan kalyan OG Glimpse

సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న `ఓజీ`లో పవన్‌ కళ్యాణ్‌తోపాటు బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి, అర్జున్‌ దాస్‌, శ్రీయా రెడ్డి, తేజ్‌ సప్రూ(రజాకార్‌ ఫేమ్‌) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రియాంక మోహన్‌ హీరోయిన్. ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కేవలం పవన్‌ కళ్యాణ్‌ డేట్స్ కోసం వెయిట్‌ చేస్తున్నారు. 15 రోజులు ఆయన షూటింగ్‌లో పాల్గొంటే సినిమా పూర్తవుతుంది. రాజకీయాల్లో బిజీ కారణంగా పవన్‌ టైమ్‌ ఇవ్వలేకపోతున్నారు. ఎన్నికల అనంతరం ఆయన ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొంటారు. 
 

ఈ నేపథ్యంలో మూవీ గురించి మరో అదిరిపోయే లీక్‌ ఇచ్చాడు `రజాకార్‌` నటుడు. `రజాకార్‌`లో పటేల్‌ పాత్రలో నటించిన తేజ్‌ సప్రూ.. `ఓజీ`లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇమ్రాన్‌ హష్మి పాత్రకి తండ్రిగా కనిపిస్తారట. ఇమ్రాన్‌ హష్మి మెయిన్‌ విలన్‌ గా కనిపిస్తారట. ఆయనకు తండ్రి పాత్రలో నెగటివ్‌ రోల్‌లోనే తేజ సప్రూ కనిపించనున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్‌ పాత్రని లీక్‌ చేశాడు. 
 

ఇందులో పవన్‌ మూడు భిన్నగెటప్స్ లో కనిపిస్తారట. ఆయన పాత్రలో మూడు షేడ్స్ ఉంటాయని తెలిపారు. యూనియన్‌ లీడర్‌గా, డాన్‌ కనిపిస్తారట. దీంతోపాటు పొలిటికల్‌ లీడర్‌ పాత్రలోనూ పవన్‌ కనిపిస్తారని తెలిపాడు. సినిమా నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని, ఇప్పటి వరకు వచ్చిన సినిమాలకు మించి ఇది ఉంటుందన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రచ్చ లేపుతున్నాయి. 

ఇప్పటికే ఆ మధ్య `సలార్‌` ప్రమోషన్స్ లో శ్రియా రెడ్డి సినిమాపై ఓ రేంజ్‌ హైప్‌ ఇచ్చింది. `సలార్‌`ని మించి ఉంటుందని తెలిపింది. యాక్షన్‌, ఎలివేషన్స్ తోపాటు ఎమోషన్స్ ఉంటాయని, మహిళలకు సంబంధించిన ఎమోషన్స్ మెయిన్ గా ఉంటుందని ఆయన సీన్లలో పవన్‌ రెచ్చిపోయాడని తెలిపింది. ఇప్పుడు తేజ్‌ సప్రూ పవన్‌ మూడు గెటప్స్ లో కనిపిస్తారని చెప్పడం విశేషం. 

దీంతో ఇప్పట్నుంచే ఫ్యాన్స్ ఫెస్టివల్‌కి రెడీ అవుతున్నారు. ఇక థియేటర్లో పూనకాలే అనే కామెంట్లు పెడుతున్నారు. సినిమా నిజంగానే ఆ రేంజ్‌లో ఉంటే, అది థియేటర్లో వర్కౌట్‌ అయితే ఇక పవన్‌ ని ఆపడం ఎవరి తరం కాదంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మించే ఈ మూవీ సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. పవన్‌ నటిస్తున్న మొదటి ప్రాపర్‌ పాన్ ఇండియా మూవీ ఇదే కావడం విశేషం. 
 

click me!