బద్ద శత్రువులు కలిసే టైమ్ వచ్చింది..బద్రి, సుస్వాగతం, జల్సా, వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ..

First Published | Oct 17, 2024, 2:36 PM IST

నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అయితే ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో.. ఇప్పుడు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వైరం కూడా అంతే ఫేమస్ అవుతోంది. 

నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అయితే ఏంటి అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో.. ఇప్పుడు పొలిటికల్ గా పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వైరం కూడా అంతే ఫేమస్ అవుతోంది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వైపు స్టాండ్ తీసుకోవడం ప్రకాష్ రాజ్ కి నచ్చలేదు. దీనితో ప్రకాష్ రాజ్.. పవన్ ని తీవ్రంగా విమర్శిస్తూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు. పవన్ అభిమానులు కూడా ప్రకాష్ రాజ్ ట్వీట్లకు అంతే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. 

pawan kalyan

పొలిటికల్ గానూ, సినిమాల్లోనూ .. పవన్, ప్రకాష్ రాజ్ మధ్య ఎప్పుడూ శత్రుత్వమే ఉంటుంది. బద్రి చిత్రంలో  వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అయ్యాయి. సుస్వాగతం చిత్రంలో ప్రకాష్ రాజ్ కూతుర్నే పవన్ కళ్యాణ్ ప్రేమిస్తారు. ఈ మూవీలో నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అంటూ  ప్రకాష్ రాజ్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. 



ఆ తర్వాత పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ జల్సా, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ బద్ద శత్రువులు కలిసే టైం వచ్చింది. పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓజి చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారట. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సంబంధం లేని సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రకాష్ రాజ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారట. 

Prakash raj in politics

త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ప్రకాష్ రాజ్, పవన్ మధ్య సుజీత్ కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఈ న్యూస్ సినీ సర్కిల్స్ లో ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఒకవైపు విమర్శలు చేసుకుంటూ మరోవైపు అవన్నీ పక్కన పెట్టి పవన్, ప్రకాష్ రాజ్ నటించాల్సి ఉంటుంది. రాజకీయంగా శత్రుత్వం ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మిత్రులుగా ఉంటారా అనేది పెద్ద ప్రశ్న. 

Latest Videos

click me!