టాలీవుడ్ దర్శకులకి సర్ప్రైజ్.. గిఫ్ట్స్ పంపుతున్న పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు

Published : Dec 23, 2022, 11:26 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రంతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. 

PREV
16
టాలీవుడ్ దర్శకులకి సర్ప్రైజ్.. గిఫ్ట్స్ పంపుతున్న పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రంతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఉస్తాద్  భగత్ సింగ్ చిత్రం ప్రారంభం ఐంది. 

 

26

ఇదిలా ఉండాగా పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది చిత్ర పరిశ్రమలోని తన సన్నిహితులకు మామిడి పండ్లు పంపడం.. పండుగలకు గిఫ్ట్స్ పంపడం చూస్తూనే ఉన్నాం. త్రివిక్రమ్,అలీ , నితిన్, వేణు శ్రీరామ్ లాంటి వారికి పవన్ కళ్యాణ్ గతంలో బహుమతులు పంపారు. 

36

గత ఏడాది దీపావళికి పవన్, అన్నా లెజినోవా దంపతులు మహేష్ అబూ దంపతులకు గిఫ్ట్స్ పంపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది క్రిస్టమస్ సందర్భంగా.. పవన్ కళ్యాణ్, లెజినోవా గిఫ్ట్స్ పంపడం ప్రారంభించారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

46

వకీల్ సాబ్ డైరెక్టర్ కి పవన్, లెజినోవా మరోసారి క్రిస్టమస్ బహుమతులు, గుడ్డీస్ పంపినట్లు తెలుస్తోంది. అలాగే క్రిస్టమస్ గ్రీటింగ్స్ తెలిపారు. వాటిపై  పవన్ కళ్యాణ్, అన్నా అని రాసి ఉంది. 

 

56

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది తన అత్తగారిల్లు రష్యాకి క్రిస్టమస్ వేడుకలకి వెళతారు. కానీ ఈ ఏడాది పవన్ క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ ఇక్కడే జరుపుకోనున్నారట. షూటింగ్స్ తో బిజీగా ఉండడం, త్వరలో వారాహి పొలిటికల్ యాత్ర ప్రారంభం కానుండడంతో పవన్ కళ్యాణ్ రష్యా టూర్ విరమించుకున్నట్లు తెలుస్తోంది. 

66

సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ వీటన్నింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. 

 

Read more Photos on
click me!

Recommended Stories