ఈరోజు ఎపిసోడ్లో వసుధార, రిషి ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు. అప్పుడు రిషి నీళ్లు తాగడం కోసం కారు ఆపడంతో వసుధార దగ్గర కూడా వాటర్ లేవు అని చెప్పగా సరే ముందుకు వెళ్లి కారు ఆపుదామని అంటాడు రిషి. అప్పుడు వసుధార రిషి వైపు అలాగే చూస్తూ ఉండడంతో ఏంటి అలా చూస్తున్నావు అని అడగగా నా రిషి సార్ నా ఇష్టం నేను చూస్తాను అని అంటుంది. అప్పుడు రిషి కూడా వసు వైపు చూస్తుండగా మీరేంటి అలా చూస్తున్నారు సార్ అనడంతో నా వసుధార నా ఇష్టం అని అంటాడు. ఇంతలో ఒక షాపు రావడంతో రిషి దిగి వెళ్తుండగా నేను కూడా వస్తాను సార్ అని అంటుంది.