200 పైగా దర్శకులు, ఎన్టీఆర్ తోనే 100కు పైగా సినిమాలు, కైకాల ఖాతాలో ఇలాంటి రికార్డులెన్నో..

Published : Dec 23, 2022, 10:25 AM IST

 కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విశాదం అలముకుంది. ఇండస్ట్రీలో ఆయన క్రియేట్ చేసిన రికార్డులెన్నో.. అవార్డులు పెద్దగా రాకపోయినా.. రికార్డ్ లు మాత్రం చాలా క్రియేట్ చేశారు కైకాల.   

PREV
19
200 పైగా దర్శకులు, ఎన్టీఆర్ తోనే 100కు పైగా సినిమాలు, కైకాల ఖాతాలో ఇలాంటి రికార్డులెన్నో..

నవరసనటులు.. అలనాటి  సీనియర్  స్టార్  కైకాల సత్యనారాణయ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపుతున్న ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ.. ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో కన్నుమూశారు.88 ఏళ్ల కైకాల సత్యనారాయణ 60 ఏళ్ల సినీజీవితంలో 770కు పైగా సినిమాతో పాటు.. ఎవరుసాధించలేని రికార్డులెన్నో సాధించి చూపించారు. తరువాతి తరం నటీనటులకు ఆదర్శంగా నిలిచారు మహానటుడు. 

29

హీరోగా స్టార్ట్ అయిన కైకాల సినీ ప్రస్థానంలో.. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా.. తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, తాతగా, ఇలా కైకాల పోషించని పాత్రంటూ లేదు అని అనిపించుకున్నారు. 1959 లో సిపాయి కూతురు సినిమాతో స్టార్ట్ అయిన కైకాల సినిమా ప్రస్థానం.. 2019 మహర్షి సినిమా వరకూ సాగింది. అలా 60 ఏళ్ళపాటు నటనే ఊపిరిగా బ్రతికారు కైకాల. 

39

కైకాల నట జీవితంలో అనేక రకాల పాత్రలు పోషించారు. అన్నింటికి న్యాయం చేశారు కూడా. దాదాపుగా 28 పౌరాణిక పాత్రలు, 50 కి పైగా జానపద పాత్రలు, 10కి పైగా చారిత్రాత్మక పాత్రలు పోషించారు కైకాల. అందుకే ఆయన నవరస నటసార్వభౌముడయ్యారు. 
 

49

కైకాల తన ఫిల్మ్ కెరీర్ లో దాదాపు గా 200 మంది దర్శకులతో పనిచేశారు. అలాగా 50కి పైగా హీరోలతో నటించారు.  తన కుటుంబం నుంచి ఒక్కరినైనా ఇండస్ట్రీలో తన వారసుడిగా పరిచయంచేయాలి అనుకున్నారు కైకాల. కాని ఆయన ఆశ తీరలేదు.. కైకాల కుటుంబం నుంచి నటులుగా ఎవరూ సిల్వర్ స్క్రీన్ మీదకు రాలేదు. 
 

59

అంతే కాదు కైకాల సత్యనారాయణ నటించిన 230కి పైగా సినిమాలు థియటర్లలో 100 రోజులు ఆడాయి. 60 సినిమాల వరకూ 50 రోజులు ఆడి రికార్డ్ క్రియేట్ చేశాయి. అంతే కాదు దాదాపు 10 సినిమాలో ఏడాది వరకూ థియేటర్లో సందడి చేసి...రికార్డ్ క్రియేట్ చేశాయి. 
 

69
Kaikala Satyanarayana

నాటక రంగంగంలో అపార అనుభవం ఉన్న కైకాల హీరోగా పరిశ్రమలోకి ఎంటర్ అయ్యారు. కైకాలలో నటనను గుర్తించి  తెరకు పరిచియం చేసిన వ్యక్తి డిఎల్ నారాయణ. అయితే కైకాల జీవితాన్ని మలుపు తిప్పిన వ్యక్తి మాత్రం  నందమూరి తారక రామారావు గారే

79

రికార్డ్ స్థాయిలో ఎన్టీఆర్ తో 100కు పైగా సినిమాల్లో నటించారు కైకాల సత్యనారాయణ. కైకాల ఇండస్ట్రీకి వచ్చిన కోత్తలో ఎన్టీఆర్ డూప్ గా పిలిచేవారు. రాముడు భీముడు లాంటి సినిమాల్లో  ఎన్టీఆర్ డూపు గా కూడా సత్యనారాయణ పనిచేశారు. విలన్ గా ఉన్న కైకాలను సాప్ట్ క్యారెక్టర్ల వైపు మళ్లించింది ఎన్టీఆరే.. అప్పుడు ఆయన ఈ సాహసం చేయబట్టే.. రకరకాల పాత్రలు చేయగలిగారు  కైకాల. 
 

89

యముడిగా ఎక్కువ సార్లునటించిన కైకాల... దుర్యోధనుడిగా, రావణాసురిడిగా, దుర్యోధనుడిగా, దుస్సాసనుడిగా, ఇంద్రుడిగా, ఘటోద్గచుడిగా ఇలా ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించారు కైకాల సత్యణారాయణ. సినీ పరిశ్రమకు ఇంత సేవచేసినా.. నంది, ఫిల్మ్ ఫేర్, రఘపతి వెంకయ్య అవార్డ్ తప్పించి..పద్మా అవార్డ్ లు కైకాలను వరించకపోవడం ఆశ్చర్యంకలిగించే విషయం.

99

1996 లో రాజకీయాల్లోకి వచ్చిన కైకాల.. మచిలీపట్నం నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎన్నిక అయ్యారు. ఆతరువాత కొంత కాలానికి రాజకీయాలకు దూరం అయ్యారు. తెలుగు చలన చిత్ర చరిత్రలో కైకాల సత్యనారాయణ పేరు మీద ఎక్కువ పేజీలు ఉంటాయి.. ఉండాలి కూడ. ఎందుకంటే 90 ఏళ్ళ తెలుగు సినిమాలో ఆయన వంతు 60 ఏళ్లకు పైనే. 
 

click me!

Recommended Stories