అది నడుమా, నయాగరా జలపాతమా... జీరో సైజ్ నడుములో క్రేజీ ఫోజులిచ్చిన వర్షిణి!

First Published May 13, 2021, 10:44 AM IST


హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే అందం యాంకర్ వర్షిణి సొంతం. నిలువెత్తు అందాలలో కవ్వించే ఈ పొడుగు కాళ్ళ సుందరి సోయగాలు వర్ణించడం కవులకు కూడా కొంచెం కష్టమే అని చెప్పాలి. 
 

కాలం కలిసి రాక వర్షిణి పాప బుల్లితెరకు పరిమితం అయ్యింది. వర్షిణి కి ఉన్న గ్లామర్ కి, వెండితెరపై వెలిగిపోవాల్సింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి, హీరోయిన్ గా కొన్ని చిన్న చిత్రాలలో నటించారు. ఆ సినిమాలు ఏవీ వర్షిణికి బ్రేక్ ఇవ్వలేదు.
undefined
వెండితెరపై గుర్తింపు రాకపోవడంతో బుల్లితెర వైపు అడుగులు వేసింది. అనసూయ, రష్మీ గౌతమ్ మాదిరి హాట్ యాంకర్ గా బిజీ కావాలన్నది వర్షిణి ప్రస్తుత టార్గెట్. అయితే ఆ హోదాకు వర్షిణి ఇంకా దూరంగానే ఉంది.
undefined
అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన ఢీ డాన్స్ రియాలిటీ షోలో వర్షిణి యాంకర్ గా చేశారు. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదికి జోడీగా ఢీ వేదికపై వర్షిణి చేసిన రొమాన్స్ బాగానే పండింది. కారణం ఏమిటో కానీ లేటెస్ట్ సీజన్ కి వర్షిణిని పక్కన పెట్టారు.
undefined
అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోకి వర్షిణి యాంకర్ గా ఎంపికయ్యారు. కొన్నాళ్లుగా ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో ఆమె సోలో యాంకర్ గా ఉన్నారు. ఆ షో సక్సెస్ అయిన నేపథ్యంలో వర్షిణికి మరిన్ని ఆఫర్స్ దక్కే అవకాశం కలదు.
undefined
ఆఫర్స్, కెరీర్ సంగతి ఎలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వర్షిణి కాకరేపుతున్నారు. తాజాగా పర్ఫుల్ కలర్ ట్రెండీ వేర్ లో నడుము చూపిస్తూ హొయలు పోయింది వర్షిణి.
undefined
నయాగరా జలపాతం లాంటి వర్షిణి నడుము చూసిన ఆమె ఫ్యాన్స్ కిక్ ఫీలవుతున్నారు. అందుకే క్రేజీ కామెంట్స్ చేస్తూ, వర్షిణి ఫోటోలను వైరల్ చేస్తున్నారు. వర్షిణి లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ గా మారాయి.
undefined
బుల్లితెర యాంకర్ గా టాప్ పొజిషన్ పై కన్నేసిన వర్షిణి, నటిగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటిటితో పాటు వెండితెర అవకాశాల కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు.
undefined
click me!