
సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరికి సంబంధించిన ప్రేమ వ్యవహారం, సహజీవనం గతేడాది పెద్ద దుమారం రేగింది. తన మూడో భార్యతో విడాకులు ఫైనల్ కాకముందే పవిత్ర లోకేష్‌ని పెళ్లి చేసుకునేందుకు రెడీ కావడం దుమారం రేగింది. అలాగే పవిత్ర లోకేష్ కూడా తన భర్తతో ఇంకా విడాకులు ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కలవడం ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అటూ కన్నడ, తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది.
ఇదిలా ఉంటే తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో, ఏం జరిగిందో తెలియజేందుకు ఏకంగా ఓ సినిమానే తీశారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో `మళ్లీ పెళ్లి` అనే సినిమాని రూపొందించారు. ఇందులో ఈ ఇద్దరు కలిసి నటించారు. తమ జీవితంలోని ఘటనలను చూపించే ప్రయత్నం చేశారు. వాస్తవాలను కొంత, తమ వెర్షన్ కొంత యాడ్ చేసి తాము ఎలాంటి పరిస్థితుల్లో కలిశామో తెలిపే ప్రయత్నం చేశారు. కానీ ఈ సినిమా ఆడలేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. అది పక్కన పెడితే వారు తీసిన ఉద్దేశ్యం మాత్రం నెరవేరింది. వాళ్లు హ్యాపీగానే ఉన్నారు.
ఈ సందర్భంగా ఈ ఇద్దరికి ఓ క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. మళ్లీ పిల్లలను కంటారా? ఇప్పటికే నరేష్ ముగ్గురు భార్యలతోనూ పిల్లలు కన్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలున్నట్టు టాక్. అలాగే పవిత్ర లోకేష్‌కి కూడా ఇద్దరు పిల్లలున్నారు. వాళ్లు పెద్ద వాళ్లు కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు కలిసి ఈ ఇద్దరు పిల్లలు కనే ఉద్దేశ్యం ఉందా? భవిష్యత్‌లో ఏం చేయబోతున్నారనే ప్రశ్నకి స్పందించింది పవిత్ర లోకేష్. తాము తీసుకున్న సంచలన నిర్ణయాన్ని బయటపెట్టారు.
దీనిపై పవిత్ర లోకేష్ స్పందిస్తూ, ఈ సమాజంలో చాలా మంది పిల్లలు అనాథలుగా ఉన్నారు. పేరెంట్స్ లేని పిల్లలు ఉన్నారు. తాము కలిసిన ఉద్దేశ్యం అది కాదని చెప్పింది. దాని గురించి తాము ఆలోచించడం లేదని, మోరల్‌గా మేం సపోర్ట్ గా ఉండాలనేది తాను కోరుకుంటున్నట్టు, ఆ ప్రేమ, ఆప్యాయతలు, రెస్పెక్ట్ ఇచ్చిపుచ్చుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ అని చెప్పింది.
ఈ క్రమంలో కల్పించుకున్న నరేష్ మాట్లాడుతూ, తాను, పవిత్ర పిల్లలు కనేందుకు మెడికల్‌గా, ఫిజికల్‌గా ఫిట్‌గానే ఉన్నామని తెలిపారు. ఇప్పటికీ తాము పిల్లలను కనొచ్చు అని, అయితే ఇప్పుడు పిల్లలను కంటే తనకు 80ఏళ్లు వచ్చేసరికి తమకు పుట్టబోయే బిడ్డకి 20ఏళ్లు వస్తాయని, అలా అవసరమా మాకు అని తెలిపారు. భార్యాభర్తలుగా మేం కలిసి ఉండటమే ఇప్పుడు ముఖ్యమని తెలిపారు. పవిత్ర పిల్లలు, తన పిల్లలు ఇద్దరూ తమ బిడ్డలే అని, మాకు ఇప్పుడు ఐదుగురు పిల్లలు ఉన్నారనుకుని బతుకుతున్నామని తెలిపారు నరేష్.
అంతేకాదు ఈ సందర్భంగా మరో విషయాన్ని స్పష్టం చేశారు. తాము అమ్మగారు విజయనిర్మల, కృష్ణగారు లాగే ఉండిపోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. తనకు నేను, నాకు ఆమె పిల్లలుగానే భావిస్తామని, ఒకరినొకరం ప్రేమగా చూసుకుంటామని చెప్పారు నరేష్. తాను అమ్మ విజయనిర్మల, కృష్ణ చనిపోయినట్టు చాలా కుంగిపోయానని, కానీ పవిత్రలో ఆ ప్రేమ, ఆప్యాయత, ధైర్యాన్ని చూశానని తెలిపారు నరేష్. ఈ సందర్భంగా మరో విషయాన్ని తెలిపారు. ఇప్పటి వరకు నరేష్‌కి ఎంత ఆస్తి ఉందో, ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో కూడా తెలియదని పవిత్ర, అలాగే పవిత్రకి ఎంత ఆస్తి ఉంది, ఆమెకి ఎంత వస్తుందో అనేది కూడా తనకు తెలియదని నరేష్ తెలిపారు. తనని బాగాచూసుకుంటున్నాడు అదే తనకు ముఖ్యమని చెప్పింది పవిత్ర.
గతేడాది ఈ ఇద్దరు జంట పెద్ద సెన్సేషనల్‌గా మారారు. కానీ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీరిని అంతా మర్చిపోయారు. వీరి మాజీలు కూడా కూల్ కావడంతో ఇప్పుడు అంతా సాఫీగా సాగుతుంది. ఎవరికి వాళ్లు సినిమాల్లో బిజీగా ఉన్నారు. నరేష్ ఎప్పటిలాగే సినిమాల్లో బిజీగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. పవిత్ర లోకేష్‌కి మాత్రం తక్కువగా కనిపిస్తుంది.