అఖిల్ అక్కినేని గత ఏడాది నవంబర్ లో తనకి కాబోయే జీవిత భాగస్వామిని అధికారికంగా ప్రకటించారు. అఖిల్, జైనాబ్ రావ్జీ అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 26న వీరిద్దరికీ కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగినట్లు నాగార్జున ప్రకటించారు. అఖిల్, శోభిత వివాహానికి కొద్దిరోజుల ముందు ఈ ప్రకటన చేశారు.