Pavala Syamala Passed Away: సీనియర్‌ నటి పావలా శ్యామల ఇకలేరు.. దయనీయ స్థితిలో కన్నుమూత

Published : Jul 28, 2026, 07:25 AM IST

సీనియర్‌ నటి, తనదైన నటనతో నవ్వులు పూయించిన పావలా శ్యామల కన్నుమూశారు. ఆమె హార్ట్ ఎటాక్‌తో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఇండస్ట్రీ విషాద ఛాయలు అలుముకున్నాయి.

PREV
14
నటి పావలా శ్యామల కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల ఇకలేరు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆదుకునేవారి కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలో చాలా మంది సినీ ప్రముఖులు, స్టార్స్, ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు తలా కొంత సహాయం చేస్తూ వచ్చారు. దీంతో ఇన్నాళ్లు ఆమె ప్రాణాలతో పోరాడారు.  కానీ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి తర్వాత(జులై 28, 1.52కి) ఆమె తుది శ్వాస విడిచారు.

24
హార్ట్ ఎటాక్‌తో పావలా శ్యామల కన్నుమూత

ఆ సమయంలో పావలా శ్యామలకి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని వైద్యులు తెలిపారు. హార్ట్ ఎటాక్ కంట్రోల్‌ కాకపోవడంతో ఆమె మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. కూతురి దీనస్థితి, పావలా శ్యామల గత కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఆమెతో పాటే ఉన్న ఆమె కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం చిత్ర పరిశ్రమను, అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. శ్యామల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

34
బాలయ్య సినిమాతో సినీ కెరీర్‌ స్టార్ట్

పావలా శ్యామల 1951లో పల్నాడు జిల్లా అమరావతిలో జన్మించారు. కెరీర్‌ ప్రారంభంలో ఆమె నాటకాలు వేశారు. అలా `పావలా` అనే నాటకంతో బాగా పాపులర్‌ అయ్యారు. దీంతో నేతి శ్యామల కాస్త పావలా శ్యామలగా మారిపోయారు. పదుల సంఖ్యలో నాటకాలు వేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం ప్రయత్నించగా, మొదటగా బాలయ్య సినిమాలో ఛాన్స్ రావడం విశేషం. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గా వందల సినిమాలు చేసిన ఆమె 1985లో బాలకృష్ణ హీరోగా వచ్చిన `బాబాయ్‌ అబ్బాయి` చిత్రంతో వెండితెరకు నటిగా పరిచయం అయ్యారు.

44
ఆమె నటించిన సినిమాలు

`బాబాయ్‌ అబ్బాయ్`, `మొగుడు పెళ్లాలు`, `స్వర్ణ కమలం`, `కర్తవ్యం`, `దండోరా`, `చీమలదండు`, `సుస్వాగతం`, `కోదండరాముడు`, `మనసంతా నువ్వే`, `అల్లరి రాముడు`, `ఇంద్ర`, `నిన్నే ఇష్టపడ్డాను`, `ఆంధ్రావాలా`, `వర్షం`, `మొదటి సినిమా`, `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`, `అయోధ్య`, `బహుమతి`, `బలాదూర్‌`, `గోలీమార్‌`, `కమలతో నా ప్రయాణం`, `బెంగాల్‌ టైగర్‌`, `బాబు బంగారం`, `ఖడ్గం`, `ఈశ్వర్‌`, `ఠాగూర్‌`, `ధమ్‌, `అనసూయ`, `లక్ష్మీ కల్యాణం`, `దృశ్యం`, `మత్తువదలరా` ఇలా వందల చిత్రాల్లో నటించి మెప్పించారు శ్యామల. ఆమె తనదైన నటనతో నవ్వులు పూయించారు. గయ్యాలి మహిళగా బాగా పాపులర్‌ అయ్యారు. దాంతోనే నవ్వులు పూయించారు. ఆమె మరణం విచారకరం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories