
నవీన్ పొలిశెట్టి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చాడు. తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` మూవీతో హిట్ కొట్టిన ఆయన ఆ తర్వాత `జాతిరత్నాలు`, `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`, ఇటీవల `అనగనగా ఒక రాజు` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. దానికి సంబంధించిన ప్లానింగ్‌లో ఉన్నాడు. ఇంతలో సడెన్‌గా మెరిశాడు నవీన్. తన కష్టాలు చెప్పుకున్నాడు.
నవీన్ పొలిశెట్టి తాను సినిమాల్లోకి రావడానికి ముందు పడ్డ కష్టాన్ని వెల్లడించారు. డబ్బుల కోసం ఇబ్బందులు పడ్డాడట. `సినిమాల్లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చాను. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను. వందల ఆడిషన్స్ రిజెక్ట్ అయ్యాను. కానీ ఈ రోజు సూపర్ హిట్ సినిమాలను ఇచ్చి స్టార్ అయ్యాను, ఇది నా స్టోరీ` అని తెలిపాడు నవీన్ పొలిశెట్టి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులు అవసరం లేదు, క్రెడిట్ కోసం ఈజీ మార్గం ఉందని, `ఎంపాకెట్`ని వాడుకొని ఈజీగా మనీ పొంది మీరు కావాల్సిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని, కావాల్సిన వ్యాపారాలను చేసుకోవచ్చని చెబుతున్నాడు నవీన్ పొలిశెట్టి.
నవీన్ పొలిశెట్టి యాడ్స్ చేయడం చాలా అరుదు. చాలా సెక్టీవ్‌గానే యాడ్స్ చేస్తుంటారు. తాజాగా ఆయన `ఎం పాకెట్`(mPokket) యాడ్ చేశాడు. ఇందులో తన లైఫ్ గురించి చెప్పారు. ఇది రెగ్యూలర్ ఎండార్స్ మెంట్లకు భిన్నంగా ఉండటం విశేషం. ఏదో హడావుడిగా, ఆర్టిఫీషియల్‌గా కాకుండా, తన రియల్ లైఫ్‌ని ఆవిష్కరిస్తూ, తన ఇన్‌స్పైరింగ్ జర్నీ గురించి చెబుతూ ఈ యాడ్ ని పరిచయం చేయడం విశేషం. ఈ లోన్ యాప్ ద్వారా క్షణాల్లో డబ్బులు పొందొచ్చు, అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్పారు. ఇతర ఫ్రాడ్ యాడ్స్ మాదిరిగా ఇది కాదనే విషయాన్ని, దీన్ని నమ్మొచ్చు అనే విషయాన్ని నవీన్ భరోసా ఇస్తున్నారు.
నటుడు నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ, `mPokket లక్ష్యం గురించి తెలుసుకున్నప్పుడు అది నాకు చాలా వ్యక్తిగతంగా అనిపించింది. ఎన్నో సంవత్సరాలు ఆడిషన్లకు వెళ్లి, మళ్లీ మళ్లీ నా ప్రతిభను నిరూపించుకోవాల్సి వచ్చింది. మనలాంటి వారి కోసం వ్యవస్థ ఎప్పుడూ అనుకూలంగా ఉండదనే విషయం నాకు ప్రత్యక్ష అనుభవం. భారతదేశంలోని చాలా మంది యువత కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారిలో ప్రతిభ ఉంది, కష్టపడే తత్వం ఉంది, పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. కానీ తదుపరి అడుగు వేయడానికి అవసరమైన క్రెడిట్ కావాల్సిన సమయంలో అవకాశాల తలుపులు వారి ముందే మూసుకుపోతాయి. ఆ పరిస్థితిని మార్చేదే mPokket. అనవసరమైన నిరూపణలు కోరకుండా, యువతకు నిజమైన అవకాశాన్ని అందిస్తుంది. ఆ ఆలోచనను నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. అందుకే ఈ భాగస్వామ్యం నాకు ఎంతో సహజంగా అనిపించింది` అని వెల్లడించారు.
mPokket వ్యవస్థాపకుడు, CEO గౌరవ్ జలాన్ మాట్లాడుతూ, `భారతదేశంలోని యువత ఎంతో కష్టపడి పనిచేస్తూ, మంచి ఫలితాలు సాధిస్తూ, ప్రతిరోజూ ముందుకు సాగుతున్నారు. అయినప్పటికీ, వారికి అత్యంత అవసరమైన సమయంలో క్రెడిట్ అందుబాటులో లేకపోవడం వల్ల అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆ పరిస్థితిని మార్చాలనే లక్ష్యంతోనే mPokketను ప్రారంభించాం. ఇప్పటివరకు మా ప్లాట్‌ఫారమ్ ద్వారా 65 లక్షల మంది భారతీయులు తమ జీవితంలో మొదటిసారిగా అధికారిక రుణాన్ని పొందారు. విశేషమేమిటంటే, ఈ న్యూ-టు-క్రెడిట్ (NTC) రుణగ్రహీతల్లో దాదాపు 79 శాతం మంది తమ తొలి రుణాన్ని తీసుకున్నప్పుడు 25 ఏళ్లలోపే ఉన్నారు. లక్షలాది మంది భారత యువతకు వారి ఆర్థిక గుర్తింపు ప్రారంభమైన మొదటి అడుగు mPokket ద్వారానే పడింది. నవీన్ ఎన్నో సంవత్సరాల పాటు తన ప్రతిభను నిరూపిస్తూ ముందుకు సాగినా, సినీ పరిశ్రమ ఆయనను మళ్లీ మళ్లీ తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో ఉంచింది. ఒక వ్యక్తి సామర్థ్యానికి, ప్రపంచం అతనిపై ఉంచే నమ్మకానికి మధ్య గ్యాప్‌ని తగ్గించడానికే mPokket ఏర్పడింది. ఈ ప్రచారం కేవలం ఒక రూపకం కాదు. మేము mPokketను ఎందుకు ప్రారంభించామో అత్యంత నిజాయితీగా చెప్పే కథ ఇది` అని ఆయన తెలిపారు.