దీనిపై తాజాగా పటాస్ ప్రవీణ్ రియాక్ట్ అయ్యాడు. జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొన్న ప్రవీణ్.. తన బ్రేకప్ గురించి నీకు కూడా తెలుసు అని చెప్పాడు. `నేను నిన్ను ఇష్టపడ్డాను, నువ్వు నన్ను ఇష్టపడు, పడకపో, నువ్వు ఒక క్లారిటీతో ఉన్నావు, నేను కూడా ఒక క్లారిటీతో ఉంటే అయిపోతుంది కదా. బెస్ట్ ఫ్రెండ్‌లా ఉండొచ్చు. మంచి సపోర్ట్ దొరుకుతుంది. నేను దానిమీదనే ఉన్నాను, ఇప్పుడు మేమిద్దరం బాగానే ఉన్నాం` అని తెలిపారు పటాస్ ప్రవీణ్. ఫైమాతో తాను బాగానే ఉన్నానని, కానీ తమ మధ్య ప్రేమ లేదని ఆయన చెప్పకనే చెప్పాడు.