Paruchuri Brothers : పరుచూరి ఆరోగ్యంపై వదంతులు.. ఎందుకు అలా అయిపోయారు, ఇదిగో క్లారిటీ

Published : Apr 01, 2022, 10:44 AM IST

పరుచూరి బ్రదర్స్ టాలీవుడ్ లో దశాబ్దాల కాలంగా చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్స్ అందరి చిత్రాలకు రచనలు అందించారు పరుచూరి బ్రదర్స్.

PREV
16
Paruchuri Brothers : పరుచూరి ఆరోగ్యంపై వదంతులు.. ఎందుకు అలా అయిపోయారు, ఇదిగో క్లారిటీ
pruchuri brothers

పరుచూరి బ్రదర్స్ టాలీవుడ్ లో దశాబ్దాల కాలంగా చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, కృష్ణ శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్స్ అందరి చిత్రాలకు రచనలు అందించారు పరుచూరి బ్రదర్స్. కొత్త తరం రావడంతో సహజంగానే వారి జోరు తగ్గింది. 

 

26
paruchuri brothers

పరుచూరి గోపాల కృష్ణ పరుచూరి పలుకులు పేరుతో యూట్యూబ్ లో అభిమానులకు చేరువగా ఉంటున్నారు. ఇక ఆయన సోదరుడు పరుచూరి వెంకటేశ్వర రావు మాత్రం అంతగా కనిపించడం లేదు. ఇటీవల దర్శకుడు జయంత్ పరుచూరి వెంకటేశ్వరరావు ని కలిశారు. ఆయనతో దిగిన ఫోటోని జయంత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

 

36
Paruchuri Venkateswararao

అది కాస్త వైరల్ గా మారింది. ఆ ఫోటోలో వెంకటేశ్వర రావు ముడతలుబారిన చర్మం, తెల్ల జుట్టుతో బాగా బరువు తగ్గిపోయి కనిపించారు. దీనితో పరుచూరి ఏదో వ్యాధితో బాధపడుతున్నారు అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం ప్రారంభించారు. ఆయన ఆరోగ్యంపై వదంతులు కూడా వ్యాపించాయి.

 

46
Paruchuri Venkateswararao

దీనితో వెంకటేశ్వర రావు సోదరుడు గోపాలకృష్ణ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 2017లో అన్నయ్య ఆస్ట్రేలియా వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం, శరీరంలో తేడాలు వచ్చాయి. వైద్య పరీక్షలు చేసుకుంటే డాక్టర్లు ఆహార నియమాలు ఫాలో కావాలి చెప్పారు. అంతకు మించి ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. 

 

56
Paruchuri Venkateswararao

జుట్టుకి రంగు వేసుకోకపోవడం.. బరువు తగ్గడం వల్ల అలా కనిపిస్తున్నారు. నేను కూడా రెండేళ్లలో 10 కిలోల బరువు తగ్గాను. ఫోటోలో అలా కనిపిస్తున్నారు అంతే. అలాంటి ఫోటో ఎందుకు షేర్ చేశావయ్యా అని జయంత్ ని ప్రశ్నించాను. ఈ ఫోటో చూసిన వారిలో తెలిసిన వ్యక్తి ఒకరు 80 ఏళ్ల వయసు వచ్చిన వ్యక్తి ఇంకెలా ఉంటారు అని ప్రశ్నించారు. దీనితో నేను కరెక్ట్ గా చెప్పారు అని అన్నాను. 

 

66
Paruchuri Venkateswararao

వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సహజం అని గోపాల కృష్ణ అన్నారు. పరుచూరి వెంకటేశ్వర రావు రచయితగానే కాక పలు చిత్రాల్లో నటుడిగా కూడా మెరిశారు. 

 

click me!

Recommended Stories