కృష్ణ, చిరంజీవి చిత్రాలు సంక్రాంతికి ఒకే రోజు రిలీజ్.. మేం కాలర్ ఎగరేశాం, వైరల్ కామెంట్స్

First Published | Jan 14, 2025, 8:11 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ సెంటిమెంట్.  ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాలు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి సీజన్ అంటే హీరోలు, దర్శకులు, నిర్మాతలకు మాత్రమే కాదు రచయితలకు కూడా సెంటిమెంట్. 

తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ సెంటిమెంట్.  ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు చిత్రాలు పోటీ పడుతుంటాయి. ఈ ఏడాది గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సంక్రాంతి సీజన్ అంటే హీరోలు, దర్శకులు, నిర్మాతలకు మాత్రమే కాదు రచయితలకు కూడా సెంటిమెంట్. హీరోల విషయానికి వస్తే గతంలో బాలయ్య, చిరంజీవి, వెంకటేష్ లాంటి అగ్ర హీరోల చిత్రాలు ఎక్కువగా సంక్రాంతికి రిలీజ్ అవుతుండేవి. 

సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ.. తమకి కూడా సంక్రాంతి సీజన్ బాగా కలసి వచ్చింది అని తెలిపారు. అన్నగారు ఎన్టీఆర్ నటించిన అనురాగ దేవత చిత్రం మొదలుకుని తాము పనిచేసిన అనేక చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారు అనురాగ దేవత చిత్రంలోనే మాకు పరుచూరి బ్రదర్స్ అనే స్క్రీన్ నేమ్ పెట్టారు అని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి దాదాపుగా ప్రతి ఏడాది మేము పనిచేసిన చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. 1985 సంక్రాంతికి అయితే మేము కాలర్ ఎగరేసి గర్వపడ్డాం. 


మేము పనిచేసిన సూపర్ స్టార్ కృష్ణ అగ్నిపర్వతం, మెగాస్టార్ చిరంజీవి చట్టంతో పోరాటం చిత్రాలు సంక్రాంతికి పోటీ పడ్డాయి. రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. ఈ రెండు చిత్రాలు జనవరి 11నే రిలీజ్ కావడం విశేషం. అది నిజంగా కాలర్ ఎగరేసే క్షణం మాకు అని పరుచూరి అన్నారు. 1986లో చిరంజీవి నటించిన కొండవీటి రాజా చిత్రం సంక్రాంతి ముగిసిన తర్వాత రిలీజ్ అయింది. అయినా కూడా సూపర్ హిట్ అయింది అని పరుచూరి తెలిపారు. 

1990 సంక్రాంతికి చిన్న హీరో హరీష్ తో అద్భుతం చేసినట్లు తెలిపారు. హరీష్ హీరోగా నటించిన ప్రేమ ఖైదీ తిరుగులేని విజయం సాధించింది. ఆ మూవీ తమకి ఎంతో గుర్తింపు తీసుకువచ్చినట్లు పరుచూరి తెలిపారు. 1993లో చిరంజీవి ముఠామేస్త్రి చిత్రం రిలీజ్ అయింది. 

1999లో అయితే సమరసింహారెడ్డి చిత్రంతో బాలయ్య చరిత్ర సృష్టించారు అని పరుచూరి తెలిపారు. 2003లో మహేష్ బాబు ఒక్కడు చిత్రం రిలీజ్ అయింది. మహేష్ కి తొలి మాస్ హిట్ అదే అని పరుచూరి తెలిపారు. 2004లో ప్రభాస్ నటించిన వర్షం చిత్రం రిలీజ్ అయి అద్భుతమైన విజయం సాధించింది అని పరుచూరి గుర్తు చేసుకున్నారు. 

Latest Videos

click me!