ఈమధ్యే ఆప్ ఎంపీ.. తన చిన్ననాటి స్నేహితుడైన రాఘవ్ చద్దాను పెళ్లాడింది బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా. పంజాబ్ కు చెందిన యంగ్ లీడర్ రాఘవ్ ను రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఘనంగా పెళ్ళాడింది బ్యూటీ. పరిణితి చోప్రా సినిమాల కన్నా, ఇతర విషయాలతోనే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. ప్రియాంక చోప్రా సోదరిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.