Published : Aug 27, 2023, 09:41 AM ISTUpdated : Aug 27, 2023, 10:00 AM IST
ప్రేమ బంధంతో మనసులు కలుపుకున్న జంట.. పెళ్ళి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయ్యారు. తాజాగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే ఈ సెలబ్రిటీల ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఇక పెళ్ళిని కూడా అంతకంటే గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పెళ్ళికి ముందు చెట్టాపట్టాలేసుకుని డిన్నర్ డేట్ లకు.. వెకేషన్లకు తిరిగిన వీరు.. ఇక ఎంగేజ్ మెంట్ తరువాత ఆద్యాత్మిక యాత్రలు చేస్తున్నారు.
27
parineeti chopra and raghav chadha
ఆమధ్య అమృత్ సర్ స్వర్ణదేవయాలయాన్నిసందర్శించి ప్రతేక పూజలు చేసిన ఈజంట.. తాజాగా ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఆశీస్సులు తీసుకున్నారు. పరిణీతి చోప్రా మహాకాళేశ్వరుడికి భక్తురాలు.. ఆమె కోరిక మేరకు రాఘమ్ కూడా ఆమెతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజకు హాజరయ్యారట.
37
2022లో డిసెంబర్ 26న మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో కూడా పరిణితి పాల్గొన్నది. ఇక పెళ్లికి ముందు కాబోయే భర్త రాఘవ్ చద్దాతో కలిసి శనివారం ఉజ్జయినికి చేరుకున్నది. ఆలయంలోని నందిహాల్‌లో శ్రీసూక్త పారాయణంతో మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ పూజారి యష్ గురు మీడియాకు వెల్లడించారు.
47
ఆధ్యాత్మిక సేవలో పులకించి తరిణించిన పరిణీతి చోప్రా సాప్రదాయ చీరలో, రాఘవ్ చద్దా కుర్తా పూజామాలో ప్రత్యేకంగా కనిపించారు. వీరిద్దరు పూజలో ఉండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఆడియన్స్ ఈ ఫోటోలకు రకరకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా సెప్టెంబర్ 25న పెళ్లి బంధంతో ఏకం కాబోతున్నారు.
57
ఈ క్రమంలో ఇద్దరు మహాకాళేశ్వరుడిని దర్శించుకొని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉండగా.. బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
67
చాలారోజులు ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ స్టార్ కపుల్. అయితే చాలా కాలం వరకూ ఈ విషయం ఎవరకీ తెలియదు. డిన్నర్ డేట్లు, ఫారెన్ టూర్లు ఇలా చెట్టా పట్టాలేసుకుని తిరిగినా ఎవరూ గమనించలేదు. ఒసందర్భంలో ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ..మీడియా కంటికి చిక్కింది సెలబ్రిటీ జంట. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు హాట్ న్యూస్ అవుతూనే ఉన్నారు. మీడియా కూడా వీరిమీద కన్నేసి ఉంచింది.
77
అలా ఇద్దరి డిన్నర్ డేట్ పుణ్యమా అని వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చదివారు. కామన్ స్నేహితుల ద్వారా ఇద్దరి మధ్య పరిచయం మరింత పెరిగి.. అది కాస్త ప్రేమగా మారింది.