‘స్కంద’ ఈవెంట్ లో బ్యూటీఫుల్ లుక్ లో మెరిసిన శ్రీలీలా.. వేదికపై పాట పాడి అలరించిన క్రేజీ హీరోయిన్

First Published | Aug 26, 2023, 10:31 PM IST

‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరుగుతోంది. ఈవెంట్ లో యంగ్ సెన్సేషన్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలా (Sreeleela) బ్యూటీఫుల్ లుక్ లో మెరిసింది. వేదికపై తన గాత్రంతో పాట పాడి ఆకట్టుకుంది. 
 

ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothieni) -  యంగ్ సెన్సేషన్ శ్రీలీలా జంటగా నటిస్తున్న చిత్రం ‘స్కంద’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ (Boyapati Srinivas)   దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చిత్రం ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. 
 

ఇందులో భాగంగా ఈరోజు  Skanda ప్రీరిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ (Balakrishna)  ముఖ్య అతిథిగా వచ్చారు. ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు. 
 


ఇక ఈవెంట్ లో శ్రీకాంత్, ఇంద్రజ, ప్రిన్స్, యంగ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ తోపాటు శ్రీలీలా కూడా హాజరైంది. హీరోయిన్  శ్రీలీలా వైట్ ట్రెడిషనల్ వేర్ లో బ్యూటీఫుల్ గా మెరిసింది. ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
 

సంప్రదాయ దుస్తుల్లో యంగ్ హీరోయిన్ శ్రీలీలా మరింత అందాన్ని సొంతం చేసుకుంది. మెడకు హారం, ఆకర్షణీయమైన చెవి రింగులు ధరించి అట్రాక్ట్ చేసింది. ఈవెంట్ లో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. 
 

అయితే, శ్రీలీలా ఇప్పటికే తన నటన, అందంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరోవైపు డాన్స్ పరంగానూ దుమ్ములేపుతోంది. తాజాగా తనలోని మరో కోణాన్ని ‘స్కంద’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా పరిచయం చేసింది. 
 

వేదికపై ‘స్కంద’ మూవీలోని ‘నీ చుట్టు చుట్టూ’ సాంగ్ ను పాడి ఆకట్టుకుంది. తన స్వీట్ వాయిస్ తో చక్కగా పాడింది. సింగర్ గానూ ఈ ముద్దుగుమ్మ అదరగొట్టేట్టుగా ఉందని అంటున్నారు. శ్రీలీలా పాటపాడటంతో వేదిక హోరెత్తిపోయింది. 
 

ఇక స్కంద ట్రైలర్ మాస్, పవర్ ఫుల్ యాక్షన్ తో అదిరిపోయింది. ఎమోషనల్ అంశాలతోనూ ఆకట్టుకుంది. శ్రీలీలా బ్యూటీఫుల్ గా కనిపించింది. ఇప్పటికే డాన్స్ తో చిత్రంతో ఆకట్టుకుంటోందని అర్థం అవుతోంది. ఈ మూవీతో పాటు యంగ్ బ్యూటీ ఏడేనిమిది సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. 
 

ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో గ్రాండ్ గా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటోంది. థమన్ సంగీతం అందించారు. 
 

Latest Videos

click me!