ఎపిసోడ్ ప్రారంభంలో.. తులసి, సామ్రాట్ షాపింగ్ కి వెళ్లి సామాన్లన్నీ తీసుకుని వస్తారు. ఇంట్లోకి వెళ్ళగానే తులసి కుటుంబ సభ్యులందరూ ఉంటారు. దాంతో వాళ్ళని చూసి సంతోషంగా పొంగిపోతుంది తులసి. ఇక అంకిత మీకోసం బెంగ పెట్టుకున్నాం అంటూ మాట్లాడుతుంది. నిన్నటి వరకు నీ కోపం తీరిపోతుంది నువ్వు ఇక ఇంటికి వచ్చేస్తావని ఆశతో ఉన్నాం అని కానీ నువ్వు ఇల్లు తీసుకోవడంతో ఇంకా ఆశ చచ్చిపోయింది అని అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చేసాము అంటుంది దివ్య.