కంగారు పడతారు జగతి, వసుధార. రిషి సార్ చాలా గొప్పవారు కదా అలాంటి వ్యక్తిని సేవ్ చేశారంటే ఎవరైనా ఎమోషనల్ థాంక్స్ చెప్పాల్సిందే అందుకే మేడం కూడా థాంక్స్ చెప్తున్నారు అంటూ కవర్ చేసేస్తుంది వసుధార. అంతేనా మేడం.. నేను ఇప్పటివరకు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు కానీ మీకు చెప్పాలనిపిస్తుంది రిషి ని ఎప్పటికీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుంది ఏంజెల్. ఆ మాటలకి ఆనందపడుతుంది జగతి.