ప్రభాస్‌, పవన్‌, మహేష్‌, తారక్‌, బన్నీ, విజయ్ పారితోషికాలు డబుల్.. కాసులవర్షం కురిపిస్తున్న పాన్‌ఇండియా మంత్రం

Published : Dec 17, 2022, 06:24 PM ISTUpdated : Dec 18, 2022, 11:41 AM IST

ఇండియన్‌ సినిమాల్లో ఇప్పుడు పాన్‌ ఇండియా ట్రెండ్‌ ఊపందుకుంది. స్టార్‌ హీరోల సినిమాలన్నీ పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్నాయి. వారిని చూసి కుర్ర హీరోలు సైతం అదే మంత్రం జపం చేస్తున్నారు. పారితోషికాలు డబుల్‌ చేసుకుంటున్నారు.

PREV
19
ప్రభాస్‌, పవన్‌, మహేష్‌, తారక్‌, బన్నీ, విజయ్ పారితోషికాలు డబుల్.. కాసులవర్షం కురిపిస్తున్న పాన్‌ఇండియా మంత్రం

ప్రస్తుతం అన్ని భాషల్లో పాన్‌ ఇండియా(Pan India Movies) ట్రెండ్‌ నడుస్తుంది. స్టార్‌ హీరోలంతా పాన్‌ ఇండియా రేంజ్‌ సినిమాలు చేస్తున్నారు. యంగ్‌ హీరోలు సైతం పాన్‌ ఇండియా (Pan India Heroes) సినిమాలవైపే మొగ్గుచూపుతున్నారు. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలు సక్సెస్‌ ఎంత అవుతున్నాయనేది పక్కన పెడితే హీరోలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పారితోషికాల పంట పండిస్తున్నాయి. హీరోల పారితోషికాలు డబుల్‌ చేస్తున్నాయి. Tollywood Heroes Remuneration.

29
Prabhas

ప్రభాస్‌(Prabhas) `బాహుబలి`కి ముందు 15-20కోట్ల లోపే పారితోషికం అందుకునేవారు. ఆ సినిమాతో ఆయనకు సుమారు యాభై కోట్ల వరకు పారితోషికం దక్కింది. `సాహో` చిత్రానికి 70-80 వరకు ఇచ్చారని టాక్‌. అలాగే `రాధేశ్యామ్‌`కి వంద వరకు వెళ్లిందట. ఇప్పుడు ఆయన చేస్తున్న అన్ని సినిమాలకు వంద నుంచి 120కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్‌ చేతిలో `సలార్`, `ఆదిపురుష్‌`, `ప్రాజెక్ట్ కే` చిత్రాలున్న విషయం తెలిసిందే. ఈ మూడు సినిమాలతో సుమారు ఐదు వందలకోట్లు ఆయన పారితోషికంగా అందుకున్నాని చెప్పొచ్చు. Prabhas Remuneration.

39

మహేష్‌బాబు(Maheshbabu) ఇప్పటి వరకు పాన్‌ ఇండియా సినిమా చేయలేదు. కానీ పారితోషికం మాత్రం బాగానే అందుకుంటున్నాడు. పాన్‌ ఇండియా చిత్రాల ట్రెండ్‌ నడుస్తుండటం, ఇతర హీరోలు పారితోషికాలు పెంచడంతో మహేష్‌ కూడా పెంచుతున్నారట. ఇప్పుడు ఆయన ఒక్కో సినిమాకి రూ.70కోట్ల వరకు వసూలు చేస్తున్నారని ఫిల్మ్ నగర్‌ టాక్‌. ప్రస్తుతం త్రివిక్రమ్‌తో ఆయన సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఓ పది పెంచబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. నెక్ట్స్ రాజమౌళితో సినిమా చేయనున్నారు మహేష్‌. ఆ సినిమాకి వంద కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందట. Mahesh Remuneration.

49

అల్లు అర్జున్‌ (Allu Arjun) `అలవైకుంఠపురుములో` చిత్రానికి 20కోట్ల లోపే పారితోషికం అందుకున్నారు. ఆ సినిమా విజయంతో సుమారు 30కోట్ల వరకు పెంచాడు. `పుష్ప`కి ఆయనకు దక్కింది అదే. `పుష్ప` పాన్‌ ఇండియా లెవల్‌లో సత్తా చాటడం రూ.350కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడంతో పారితోషికం పెంచారు. ఇప్పుడు `పుష్ప2`కి ఆయనకు సుమారు రూ.60-70కోట్లు ఇవ్వబోతున్నారని టాలీవుడ్‌ టాక్‌. Allu Arjun Remuneration.

59

మరోవైపు పాన్‌ ఇండియా చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌` ఎన్టీఆర్‌(NTR), రామ్‌చరణ్‌ల పంట పండించింది. ఈ సినిమాతో వీరి పారితోషికం డబుల్‌ అయ్యింది. `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ముప్పై కోట్ల వరకు అందుకున్నారట. ఆ తర్వాత కొంత పెంచారని సమాచారం. అయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలకు వీరిద్దరు పారితోషికం డబుల్‌ చేసి రూ.60కోట్ల వరకు తీసుకోబోతున్నారని టాక్. NTR Remuneration.

69

అయితే ఈ విషయంలో రామ్‌చరణ్‌(Ram Charan) ఓ అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం ఆయన శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన సీఎంగా కనిపిస్తారని తెలుస్తుంది. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా సాగబోతుందట. ఆ తర్వాతి సినిమాకి వంద కోట్ల వరకు డిమాండ్‌ చేసే ఆలోచనలో ఉన్నారట. ఓ రకంగా పాన్‌ ఇండియా సినిమా చరణ్‌ పారితోషికం డబుల్‌ చేయడమే కాదు, కాసుల వర్షం కురిపిస్తుంది. Ram Charan Remuneration.

79

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) మాత్రం పారితోషికాల విషయంలో సెటిల్డ్ గానే ఉన్నారు. ఆయన ఒక్కో సినిమాకి ఇప్పుడు యాభై కోట్లు తీసుకుంటున్నారట. పవన్‌ చేసేవన్నీ లోకల్ మూవీస్‌. దీంతో పారితోషికం అంతే మెయింటేన్‌ చేస్తున్నారట. ఒకవేళ పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న `హరిహర వీరమల్లు` హిట్‌ అయితే పవన్‌ పారితోషికం పెరిగే అవకాశం ఉంది. Pawan Remuneration.
 

89

మరోవైపు యంగ్‌ హీరోలు కూడా పారితోషికం పెంచుతున్నారు. విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda) `లైగర్‌`కి ముందు 10-15కోట్లు పారితోషికం అందుకునేవారు. ఈ చిత్రానికి రూ.30కోట్లు రెమ్యూనరేషన్‌ ఇచ్చారట పూరీ. అయితే సినిమా ఫ్లాప్‌ కావడంతో కొంత వెనక్కి ఇచ్చారట. ఏదేమైనా `లైగర్‌` ఆయన పారితోషికాన్ని పెంచేసింది. ఇకపై విజయ్‌ దేవరకొండ రూ.30కోట్లకుపైగానే తీసుకుంటారని వేరే చెప్పక్కర్లేదు. Vijay Remuneration

99
tollywood heroes

నిఖిల్‌ పారితోషికం `కార్తికేయ2`కి ముందు రూ.5కోట్లు ఉండేదని టాక్‌. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. వంద కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో పారితోషికం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనకు పది నుంచి 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌ ఇచ్చేందుకు నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం. 15-20కోట్లు తీసుకునే రవితేజ కూడా `టైగర్‌ నాగేశ్వరరావు`తో పారితోషికం పెంచారని చర్చ నడుస్తుంది. అలాగే `మైఖేల్‌`తో సందీప్‌ కిషన్‌, `దసరా`తో నాని పాన్‌ ఇండియాచిత్రాలు చేస్తున్నారు. పారితోషికాలు పెంచుకుంటున్నారు. వీరిదారిలోనే మరో యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ కూడా ఉండటం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories