Pan Indian Movies
బాహుబలి రెండు సినిమాల తరువాత టాలీవుడ్ రేంజ్ పెరిగిపోయింది. తెలుగు పరిశ్రమ నుంచి స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే బయటకు వస్తున్నాయి. దాంతో టాలీవుడ్ ఎదుగదల చూడలేకపోయారో.. లేక తాము కూడా అలానే ఎదగాలని చూశారో తెలియదు.
కాని.. టాలీవుడ్ మాదిరి పాన్ఇండియా పాట పాడారు కోలీవుడ్, బాలీవుడ్ మేకర్స్. కాని ఈ విషయంలో టాలీవుడ్ సక్సెస్ అయినంతగా.. వారు సక్సెస్ అవ్వలేకపోయారు. ఇక ఈ ఏడాది ఇలానే పాన్ ఇండియా పాట పాడి.. దెబ్బతిన్న సినిమాలేంటో చూద్దాం.
పాన్ ఇండియా సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈగోలకు పోకుండా.. అందరిని కలుపుకుంటూ వెళ్ళాలి. మరీ మరీ ముఖ్యంగా ఆసినిమాలో ప్రాంతీయ వాసనలు లేకుండా జాగ్రత్తపడాలి.
యూనివర్సల్ కంటెంట్ ఉంటే మరీ మంచిది. తెలుగు మేకర్స్ చేస్తున్న పని అదే. తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషల నుంచి నటీనటులను తీసుకుంటున్నారు. ఎన్ని విమర్శలు వస్తున్నా.. అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్స్ ను టాలీవుడ్ ఎంకరేజ్ చేస్తుంది. దాంతో తెలుగు తారలతో మాత్రమే పాన్ ఇండియా సాధ్యం కాదు అని టాలీవుడ్ నిరూపిస్తుంది.
అయితే కోలీవుడ్, బాలీవుడ్ మాత్రం ఈ చిన్న లాజిక్ మిస్ అవుతుంది. వారు ఎంత పెద్ద సినిమాలు చేసినా.. అందులో తమ ప్రాంతీయతను జోడించి.. పాన్ ఇండియాకు పంపిస్తున్నారు. దాంతో పాన్ ఇండియాలో వారి సినిమాలు సక్సెస్ అవ్వకపోవడానికి ప్రధాన కారణం అదే అంటున్నారు సినిమా విశ్లేషకులు.
కాదు వారి సినిమాల్లో కూడా ఏదో తీసుకోలేదు అన్నట్టుగా కొంత మంది ఇతర భాషల యాక్టర్స్ ను తీసుకుంటున్నారు కాని.. వారికి పెద్దగా ప్రాధాన్యత కూడా ఇవ్వడం లేదు. సో ఇలా ఉంటే పాన్ ఇండియా వర్కౌట్అవ్వడం కష్టమనే చెప్పాలి.
ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన పాన్ ఇండియా డిజాస్టర్స్ లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాను బెస్ట్ ఎక్జాంపుల్ గాచెప్పవచ్చు. కమల్ హాసన్ కు ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు.
కాని కాని భారతీయుడు 2 సినిమా మాత్రం పాత భారతీయుడు సినిమాకు సీక్వెల్ కదా..? ఈ సినిమా లో పాన్ ఇండియా కు నచ్చే అంశాలు కనిపించలేదేమో ఆడియన్స్ కు .. ఎన్నో ఇబ్బందులు ఎదురౌనా.. కష్టపడి పని చేశారు ఈసినిమాకోసం.
అయినా సరే పాన్ ఇండియా వైడ్ గా రిలీజైన ఈ సినిమా తమిళ్ తప్ప మిగిలిన లాంగ్వేజెస్ లో జనానికి అసలు ఎక్కలేదు. తమిళ్ లో కూడా ఏదో పర్వాలేదనిపించింది తప్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వలేదు.
vettaiyan, GOAT
తమిళ హీరలను తెలుగులో కూడా ఆదరిస్తుంటారు. కాని కథలు బాగోపోతే.. ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా పక్కన పెట్టేస్తుంటారు. ఇక అది పాన్ ఇండియాలో రిలీజ్ అయితే.. పరిస్థితి ఇంకా ధారుణంగా ఉంటుంది. అదే పరిస్థితి వచ్చింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ దళపతికి.
వీరిధ్దరు విడి విడిగా తలో సినిమాతో వచ్చారు.. కాని తమిళంలో తప్ప ఇతర భాషల్లో బొక్క బోర్లా పడ్డారు. రజినీకాంత్ కు పాన్ వరల్డ్ స్థాయిలో స్టార్ డమ్ ఉంది. కాని ఆయన తాజాగా చేసిన వేట్టయన్ సినిమాక పాన్ ఇండియా పక్కన పెడితే.. పక్కనే ఉన్న తెలుగులో కూడా సరిగ్గా రెస్పాన్స్ రాలేదు.
ఇక విజయ్ దళపతి పరిస్థితి కూడా ఇదే.. ఒక వైపు పాలిటిక్స్, మరో వైపు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఈ సంవత్సరం ద గోట్ మూవీ ని రిలీజ్ చేశారు. ఎన్నో అంచనాలతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ద గోట్ మూవీ విజయ్ అంచనాల్ని తలకిందులుచేసింది.
పాన్ ఇండియా ను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఈసినిమా.. తమిళనాట కూడా సో సో అనిపించింది. తెలుగులో అయితే ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు.
Suriya
ఇక పాన్ ఇండియా వైడ్ గా సత్తా చాటాలని సిన్సియర్ గా ప్రయత్నం చేశాడు తమిళ స్టార్ హీరో సూర్య. దాదాపు రెండేళ్ల కష్టపడి కంగువ సినిమాను బయటకు వదిలారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. కాని సూర్య కంగువ కథతో ప్రాంతీయత కొట్టొచ్చినట్టు కనిపించింది.
పాన్ ఇండియాను ఆకర్శించే ఎలిమెంట్స్ ఏమీ అందులో కనిపించలేదు. భారీ బడ్జెట్, రెండుమూడేళ్ల టైమ్ ను కేటాయించారు కాని.. అన్ని భాషల్లోరిలీజ్ చేసేప్పుడు యూనివర్సల్ గా ఆలోచించి ఉంటే బాగుండేది.
ఇతర భాషల నుంచి నటులను కూడా తీసుకోలేదు. దాంతో సూర్యకు భారీగా ప్యాన్స్ ఉన్న తెలుగు లో కూడా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. పాన్ ఇండియాకు ఏమాత్రం కనెక్ట్ అవ్వలేదు. కలెక్షన్లు అయితే ధారుణం అని చెప్పాలి.
Vikram, Thangalaan, pa ranjith, ott,
విక్రమ్ హీరోగా వచ్చిన తంగలాన్ పరిస్థితి కూడా అదే. విక్రమ్ కంప్లీట్ మేకోవర్ తో పాన్ ఇండియా వైడ్ గా ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తమిళ్,తెలుగు ఆడియన్స్ కి మాత్రమే పరిమితమైంది.
ఒక రకంగా చెప్పాలంటే తెలుగు ఆడియన్స్ కు కూడా ఈ మూవ కనెక్ట్ కాలేదనే చెప్పాలి. ఇక బాలీవుడ్ లో మార్కెట్ చేసుకుందామన్న విక్రమ్ ఆలోచనలకి బ్రేక్ వేసింది. తెలుగులో కూడా కాంప్లిమెంట్స్ వచ్చినా కలెక్షన్స్ రాలేదు.
ఇలా తమిళ సినిమా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు కాని.. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు అని తెలుస్తోంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నారు.