డైరెక్ట్ చేసింది 12 సినిమాలే.. కాని రాజమౌళి ఆస్తి ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా..?

First Published | Apr 4, 2024, 10:45 AM IST

ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ రేంజ్ ను ఆస్కార్ లెవల్ కు తీసుకెళ్ళాడు దర్శకుడు రాజమౌళి. 24 ఏళ్ళ కెరీర్ లో చేసింది 12 సినిమాలే అయినా.. ప్రపంచ ప్రఖ్యాతి సాధించిన జక్కన్న ఆస్తులు ఎంత సంపాదించాడో తెలుసా..? 
 

రాజమౌళి..  ఆయన తెలుగు సినిమాకు బ్రాండ్.. టాలీవుడ్ ను ప్రపంచ సినిమా పటంలో అగ్రగామిగా నిలబెట్టిన దర్శకుడు. మన తెలుగు సినిమాను తక్కువ చేసిన బాలీవుడ్ ను  కూడా పక్కన కూర్చో బెట్టి.. ఇండియన్ సినిమా అంటే తెలుగుసినిమానే అనేలా చేసిన దర్శకధీరుడు. అందుకే రాజమౌళి పెరు చెప్పగానే సినిమాను ప్రేమించేవారికి తెలియకుండానే  గూస్ బంప్స్  వచ్చేస్తాయి. 

తెలుగు ఇండస్ట్రీ లో ఇంతకు ముందు కూడా దిగ్గజ  దర్శకులు ఎందరో ఉండేవారు.  కానీ ట్రెండ్ కు తగ్గట్టు సినిమాలలో మార్పులు చేసుకుంటూ.. ఇండస్ట్రీకి ఖ్యాతి తెచ్చి దర్శకుడు మాత్రం రాజమౌళి అనే చెప్పాలి.  రాజమౌళి ఒక రకంగం చెప్పాలంటే.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసాడు . సినిమా ఫ్లాప్ అవ్వకుండా డైరెక్ట్ చేయడంలో నెంబర్ వన్ డైరెక్టర్ ఆయనే అనిపించుకున్నాడు. 


తెలుగు ప్రేక్షరకులు జక్కన్న అని ముద్దుగా పిలుచుకునే  రాజమౌళి.. చాలా సింపుల్ గా ఉంటారు.. స్టార్ డైరెక్టర్  అన్న అహం ఆయనలో కనిపించదు. ఇంత సాధించిన ఆయన చాలా కామ్ గా నిత్య విద్యార్ధిలాగానే వ్యవహరిస్తుంటారు. ఇక రాజమౌళి గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియవు. ఇక ఆయన ఇంత సింపుల్ గా మెయింటేన్ చేస్తుంటారు.. ఎంత సంపాదించి ఉంటారు అనేదానిపై కూడా  కొన్ని వార్తలు ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. 
 

మరీ ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి టోటల్ ఆస్తి విలువలకు సంబంధించిన వార్తలు ఈమధ్య హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో బాగా  ట్రెండ్ అవుతున్నాయి.  24 ఏళ్ల సినిమా కెరకీర్ లో  రాజమౌళి చేసింది 12 సినిమాలు మాత్రమే. కాని ఆ పన్నెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఆయన హిస్టరీలోనే ప్లాప్ ఎరిగి ఉండరు జక్కన్న. 

SS Rajamouli

ఆకరికి కమెడియన్ గా ఉన్న సునిల్ ని కూడా హీరోగా  పెట్టి. బంపర్ హిట్ అందించారు రాజమౌళి.  కెరియర్ స్టార్టింగ్ లో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే రాజమౌళి ఇప్పుడు మాత్రం స్టార్ హీరోలకు డబుల్  రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట . అంతేకాదు మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమా విషయంలో ఆయన  షేర్ భారీగా ఉండబోతున్నట్టు సమాచారం., 
 

ఇక జక్కన్న ఇప్పటి వరకూ సినిమాల ద్వారా దాదాపుగా 500 కోట్లకు పైగానే కూడబెట్టినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఇతర ప్రాపర్టీస్ కూడా భారీగా ఉన్నట్టు సమాచారం.  కేవలం ఆయన తన స్వయంకృషితో ఇండస్ట్రీలోకి వచ్చి తన ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి.. సంపాదించిన ఆస్తి మాత్రమే అంటున్నారు సినీజనాలు. అంతే కాదు రాజమౌళి దుబారా ఖర్చులు చేయరు . పెట్టాల్సిన చోట మాత్రం వెనక్కి తగ్గరు. సేవింగ్స్ కూడా బాగా చేస్తారట. 

ఇక ఆయనకు ఆంధ్రా తెలంగాణాలో ఆస్తులు కూడా భారీగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  హైదరాబాద్ శివారులో ఒక పెద్ద ఫామ్ హౌస్ కూడా ఉంది. సమ్మర్ కాని.. లేదా కుదిరినప్పుడు ఆయన ఫ్యామిలీ అంతా అక్కడ వాలిపోతుంటారు. కరోనా టైమ్ లో లాక్ డౌన్ అప్పుడు వారంతా అక్కడే ఉన్నట్టు ప్రాచారం జరిగింది. ఇక  ఖరీదైన కార్లతో పాటుగా.. రాజమౌళి కొన్ని బిజినెస్ల్లో కూడా పెట్టుబడులు పెట్టారట. 

ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఈ రేంజ్ లో ఆస్తులు కూడా పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు.. అది జక్కన్నకు మాత్రమే సాధ్యమైంది. ఇక ముందు ముందు రాజమౌళి..తెలుగు సినిమాకు ఆస్కార్ ల పంట పండించబోతున్నారని అంటున్నారు సినిమాజనాలు. 
 

Latest Videos

click me!