ప్రదీప్ కి చెక్ పెట్టిన సుడిగాలి సుధీర్... స్టార్ యాంకర్ ని పక్కకు నెట్టి మనోడు రంగంలోకి!

Published : Apr 04, 2024, 08:16 AM IST

సుడిగాలి సుధీర్ అటు వెండితెరపై ఇటు బుల్లితెరపై రాణిస్తున్నాడు. తాజాగా ప్రదీప్ కి చెక్ పెడుతూ సుధీర్ ఆయన చేస్తున్న షోలోకి ఎంట్రీ ఇచ్చాడు.   

PREV
17
ప్రదీప్ కి చెక్ పెట్టిన సుడిగాలి సుధీర్... స్టార్ యాంకర్ ని పక్కకు నెట్టి మనోడు రంగంలోకి!

మేల్ యాంకర్స్ లో నెంబర్ వన్ స్థానం ప్రదీప్ మాచిరాజుదే. ఏళ్ల తరబడి ఆయన హవా సాగింది. ఆయన యాంకర్ గా చేసిన గడసరి అత్త సొగసరి కోడలు, కొంచెం టచ్ లో ఉంటే చెబుతా, ఢీ డాన్స్ రియాలిటీ షో భారీ సక్సెస్ సాధించాయి. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

27
Pradeep Machiraju- Sudigali Sudheer


అయితే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్టార్స్ గా ఎదిగాక ప్రదీప్ హవా తగ్గుతూ వచ్చింది. ఇటీవల ఓ సంస్థ జరిపిన సర్వేలో తెలుగు పాప్యులర్ నాన్ ఫిక్షనల్ పెర్సనాలిటీస్ లో టాప్ 5లో ప్రదీప్ కి స్థానం దక్కలేదు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్ టాప్ 3లో ఉన్నారు. రష్మీ, చమ్మక్ చంద్రకు తర్వాత స్థానాలు దక్కాయి. 
 

37
Pradeep Machiraju- Sudigali Sudheer

తాజాగా ప్రదీప్ కి ఝలక్ ఇస్తూ ఆయన చేస్తున్న షోకి యాంకర్ గా సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా లో సర్కార్ పేరుతో ఒక గేమ్ షో ప్రసారం అవుతుంది. గత మూడు సీజన్స్ ని ప్రదీప్ సక్సెస్ఫుల్ గా నడిపించారు. త్వరలో సీజన్ 4 ప్రారంభం కానుంది. 
 

47
Pradeep Machiraju- Sudigali Sudheer

సర్కార్ గేమ్ షో సీజన్ 4 పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే యాంకర్ గా ప్రదీప్ స్థానంలో సుడిగాలి సుధీర్ ని తీసుకున్నారు. దీంతో ప్రదీప్ అవకాశానికి సుధీర్ గండి కొట్టినట్లు అయ్యింది. సర్కార్ గేమ్ షో త్వరలో ప్రారంభం కానుంది. తేదీ ప్రకటించలేదు. 
 

57
Pradeep Machiraju- Sudigali Sudheer


అయితే ప్రదీప్ కావాలనే ఈ షో చేయడం లేదనేది మరొక వాదన. అతన్ని తప్పించలేదు. ఆయనే తప్పుకున్నారని అంటున్నారు. ప్రదీప్ బుల్లితెరకు కూడా దూరం అయ్యాడు. ఢీ రియాలిటీ షో నుండి తప్పుకున్నాడు. ప్రదీప్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుందట. ఆ సినిమా కోసమే ప్రదీప్ యాంకరింగ్ కి దూరం అయ్యాడని అంటున్నారు. 

67
Pradeep Machiraju- Sudigali Sudheer

ఇటీవల జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తూ కనిపించాడు. పాత్ర కోసం ప్రదీప్ మేకోవర్ అవుతున్నాడట. గతంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే చిత్రంతో హీరో అయ్యాడు. ఆ మూవీ పర్వాలేదు అనిపించుకుంది. 
 

77
Pradeep Machiraju- Sudigali Sudheer

మరోవైపు సుధీర్ హీరోగా రాణిస్తూనే యాంకరింగ్ వదలడం లేదు. గాలోడు చిత్రంతో సుధీర్ హిట్ కొట్టాడు. నెక్స్ట్ GOAT అనే టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్లు సమాచారం... 
 

click me!

Recommended Stories