చిరంజీవికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్... సెట్స్ లో అందరి ముందు బ్రతిమిలాడుకున్న మెగాస్టార్, కారణం?

Published : Apr 04, 2024, 06:59 AM ISTUpdated : Apr 04, 2024, 07:05 AM IST

సినిమా అనేది వందల మందితో కూడిన వ్యవహారం. ఈ క్రమంలో గొడవలు, మనస్పర్థలు అనేది చాలా కామన్. కాగా ఒక స్టార్ హీరోయిన్ చిరంజీవికి చుక్కలు చూపించిందట. ఆ స్టోరీ ఏమిటో చూద్దాం...   

PREV
16
చిరంజీవికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్... సెట్స్ లో అందరి ముందు బ్రతిమిలాడుకున్న మెగాస్టార్, కారణం?
Chiraneevi


చిరంజీవి చాలా సౌమ్యుడు. ఎవరితో అయినా మర్యాదగా మాట్లాడతాడు. తాను పెద్ద హీరోని అనే పొగరు ఉండదు. అటువంటి చిరంజీవి కూడా కొందరు నటులతో విభేదించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఓ స్టార్ హీరోయిన్ ఆయనకు చుక్కలు చూపించిందట. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.
 

26

90లలో నగ్మా స్టార్ గా వెలిగింది. అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్న నగ్మా ఇండియా వైడ్ టాప్ హీరోలతో జతకట్టింది. చిరంజీవి-నగ్మా కాంబోలో వచ్చిన మొదటి చిత్రం ఘరానా మొగుడు. ఇది సూపర్ హిట్. అనంతరం ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో జతకట్టారు. 
 

36
Nagma

1995లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన రిక్షావోడు చిత్రంలో మరోసారి నగ్మా, చిరంజీవి జతకట్టారు. ఈ చిత్రంలో నగ్మా గొప్పింటి అమ్మాయి పాత్ర చేయగా... చిరంజీవి రిక్షా కార్మికుడు పాత్ర చేశాడు. రామానాయుడు స్టూడియోలో 'పాప ఎదిరింప' అనే సాంగ్ షూట్ చేస్తున్నారట. 
 

46
Nagma

షాట్ గ్యాప్ లో చిరంజీవి-నగ్మా మధ్య చిన్న వివాదం చోటు చేసుకుందట. నగ్మా అలిగి కోపంగా మేకప్ రూమ్ నుండి వెళ్లిపోతుంటే... చిరంజీవి బ్రతిమిలాడుతూ ఆమె వెనకాల పడ్డాడట. నగ్మా... ఆగు, నా మాట విను అంటున్నారట. ఏం జరుగుతుందని సెట్ లో ఉన్నవారంతా వాళ్లనే చూస్తున్నారట. 
 

56
Nagma

ఆ రోజు షూటింగ్ అయితే జరిగిందట. రెండో రోజు కూడా అదే సాంగ్ మిగిలిన పార్ట్ షూట్ చేశారట. చిరంజీవి ఎప్పటిలాగానే అందరితో మాట్లాడుతూ నార్మల్ గా కనిపించారట. నగ్మా మాత్రం ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయిందట. అసలు నగ్మా-చిరంజీవి కి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అనేది ఎవరికీ తెలియదట.

66
Chiranjeevi

రిక్షావోడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ మూవీ తర్వాత నగ్మాతో చిరంజీవి మరో మూవీ చేయలేదు. దాన్ని బట్టి చూస్తే పెద్ద గొడవే జరిగింది. అది మేకప్ రూమ్ లో జరిగిన నేపథ్యంలో సెట్స్ లో ఉన్నవారెవరికీ స్పష్టంగా తెలియదు. ఇద్దరికీ అభిప్రాయ బేధాలు వచ్చాయనేది మాత్రం నిజం...

click me!

Recommended Stories