నా సామిరంగ చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో నాగ్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగాడు. స్టార్ మా లో నా సామిరంగ అనే స్పెషల్ ప్రోగ్రాంని సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదలయింది. బిగ్ బాస్ 7లో సందడి చేసిన శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకతో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా పాల్గొంటున్నారు.