ముచ్చటగా మూడో కారు కొన్న రోహిణి, బుల్లితెరపై ఇంత సంపాదిస్తుందా..?

First Published | Jan 7, 2024, 9:57 AM IST

స్టార్ హీరోలు కూడా ఇన్ని కార్లు కొనరేమో...పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా తమ ఎన్నికల అఫిడవీట్ లో సొంత కారు లేదని రాసేస్తారు. అటువంటిది.. బుల్లితెర నటి మూడు కార్లతో అందరికి షాక్ ఇస్తోంది. 
 

చాలా చిన్న స్టేజ్ నుంచి.. స్టార్ కమెడిన్ గా ఎదిగింది రొహిణి. లేడీ కమెడియన్ అంటే మాటలు కాదు.. ఆడియన్స్ ను మెప్పించడం కూడా అంత తేలిక కాదు. అటువంటిది ఈ ఫీల్డ్ లో మొదటి నుంచీ.. నవ్వుతూ..  నవ్విస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది రోహిణీ... బుల్లితెరపై బాగా పాపులర్ అయిన రోహిణి.  ఇండస్ట్రీలో స్టార్లను మించి కూడబెడుతున్నట్టుంది. వరుసగా ఆస్తులు కొనేస్తోంది. 

చిన్న చిన్న సీరియల్స్ తో స్టార్ట్ అయ్యింది రోహిణి కెరీర్.. ఆతరువాత ఆమె లైఫ్ ను జబర్దస్త్ కామెడీ షో కంప్లీట్ గా మార్చేసింది. జబర్థస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పండగ స్పెషల్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అంతే కాదు బుల్లితెరపై సందడి చేస్తూనే.. కొన్ని సినిమాల్లో కూడా మెరిసిన రోహిణీ.. 


ఇక బుల్లితెరపై ఈమెకు ఉన్న ఇమేజ్ తో.. బిగ్ బాస్ ఆఫర్ కూడా సాధించింది రోహిణి. బిగ్ బాస్ లో తనదైన మాటతీరు, కామెడీ టైమింగ్ తో కొంత కాలం నెట్టుకువచ్చింది. కాని టాప్ 5 కి మాత్రం చేరలేకపోయింది. మధ్యలోనే ఆమె ఎలిమినేట్ అయ్యి వచ్చేసింది. ప్రస్తుతం కెరీర పరంగా చాలా బిజీగా ఉంది రోహిణి. చేతి నిండా అవకాశాలతో రోజంతా బిజీగా ఉండటంతో పాటు.. చేతినిండా సంపాదిస్తుంది కూడా. 
 

ఇక తాజాగా రోహిణి కొత్త కారును కొన్నది. కారు కొనడంతో ఆమె వార్తల్లో నిలిచింది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే..ఆమె కొన్నదిమూడో కారు. తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె ఈ విషయాలను వెల్లడించారు. మొదటి కారు యాక్సిడెంట్ లో దెబ్బ తినగా రెండో కారును ఈ మధ్యే అమ్మేశానని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు మూడో కారును కొనుగోలు చేశానని రోహిణి చెప్పుకొచ్చారు.
 

కియో స్టెల్లోస్ జీటీఎస్ ప్లస్ కారును  కొనన రోహిణి.. ఈ కారుకు సబంధించిన విశేషాలు వెల్లడించింది. తన కెరీర్ లో ఫస్ట్  కారును 9 లక్షల పెట్టి కొన్న రోహిణి.. రెండో కారును 14 లక్షలు పెట్టి కొన్నది. ఇక మూడో కారు కోసం ఏకంగా 25 లక్షలు ఖర్చు చేసింది నటి. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది రోహిణి. అయితే ముందుగా ఆమె ఆడీకారు కొనాలని అనుకుందట. కాని దాని రేటు చూసి.. వెనక్కి తగ్గానంటోంది రోహిణి. 
 

లోన్ తీసుకునే ఛాన్స్ ఉన్నా ఆ ఆలోచన విషయంలో వెనక్కి తగ్గానని రోహిణి తెలిపారు. ఇల్లు, కారు కొనుగోలు చేశానని ఫ్లాట్ కొనుగోలు చేసి అమ్మానాన్నల పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కోరిక ఒక్కటే మిగిలి ఉందని రోహిణి వెల్లడించారు. రోహిణి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. రోహిణి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు. 

Latest Videos

click me!