OTT: సినిమాలకు సమానంగా వెబ్ సిరీస్‌లకు ఆదరణ పెరుగుతోంది. బడా నిర్మాణ సంస్థలు తెరకెక్కిస్తుండడంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం సిరీస్‌లలో నటిస్తున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకున్న అలాంటి ఒక బెస్ట్ వెబ్ సిరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీలోకి యువ హీరోలు అడుగుపెడుతోన్న సమయంలో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య చేసిన తొలి వెబ్‌సిరీస్ ‘దూత’. సూపర్‌నేచురల్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ సిరీస్‌ను విక్రమ్ కె కుమార్ తెరకెక్కించారు. 2003లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
25
ఇంతకీ కథేంటంటే.?
సాగర్ వర్మ అవధూరి అనే ప్రముఖ జర్నలిస్ట్ పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడు. కొత్తగా ప్రారంభమయ్యే ఒక పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఆ రోజు నుంచే అతడి జీవితంలో వింత పరిణామాలు మొదలవుతాయి. ఒక పాత న్యూస్‌పేపర్ కటింగ్‌లో ముందుగా కనిపించిన వార్త… కచ్చితంగా నిజమవుతుంది. మొదట పెంపుడు కుక్క మరణం, ఆ తర్వాత కుటుంబంలో వరుస విషాదాలు. ఎవరు ఎలా చనిపోతారో ముందే పేపర్ కటింగ్స్ ద్వారా తెలుస్తుండటం ఆసక్తిగా ఉంటుంది. ఈ ఘటనల వెనక కారణం ఏమిటి? ఇవన్నీ యాదృచ్ఛికమా లేక ఎవరో కావాలనే చేస్తున్నారా? సాగర్ ఎదుర్కొనే ఈ ప్రశ్నలే కథను ముందుకు నడిపిస్తాయి.
35
ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠ
దర్శకుడు విక్రమ్ కె కుమార్ కథను నిదానంగా, ఆసక్తిగా ముందుకు తీసుకెళ్లాడు. ఒక్కో ఎపిసోడ్‌లో కొత్త పాత్రలు, కొత్త మిస్టరీలు తెరపైకి వస్తాయి. ఎవరికి ఎప్పుడు ప్రమాదం వస్తుందో తెలియని స్థితి ప్రేక్షకుడిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతుంది. మొదటి ఎపిసోడ్‌తోనే ఆసక్తి పెరుగుతుంది. పూర్తిగా గుట్టు విప్పకుండా చివరి వరకు సస్పెన్స్‌ను నిలబెట్టారు.
కొన్ని ఎపిసోడ్ల తర్వాత కథ హారర్ కోణం తీసుకుంటుంది. నిజంగా అద్భుత శక్తే కారణమా? లేక మానవ మేథస్సు ఆడుతున్న క్రూరమైన ఆటనా? అనే సందేహాన్ని దర్శకుడు కావాలనే క్రియేట్ చేస్తాడు. ప్రేక్షకుడి ఆలోచనలను ఒకవైపు దెయ్యం వైపు, మరోవైపు మానవ కుట్ర వైపు తిప్పుతూ కథను ఆసక్తికరంగా నడిపించారు.
55
నాగచైతన్య అద్భుత నటన
నాగచైతన్య ఈ సిరీస్‌లో చాలా కంట్రోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జర్నలిస్ట్ పాత్రకు అవసరమైన గంభీరత అతడి నటనలో కనిపిస్తుంది. ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువత్తు తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. చీకటి టోన్లు, నిశ్శబ్దాన్ని ఉపయోగించి సస్పెన్స్‌ను పెంచిన తీరు బాగుంటుంది.