జీవితాన్ని చాలాపద్దతిగా.. ఓ లెక్క ప్రకారం బ్రతికి చూపించాడు అక్కినేని నాగేశ్వరావు. ఆయన జీవితంలో అతి పెద్ద ఆరోగ్య సమస్యను కూడా అధిగమించి.. డాక్టర్లనే ఆశ్చర్యపరిచాడు. ఏఎన్నార్. అది ఎలా సాధ్యం అయ్యింది.
అక్కినేని నాగేశ్వరావు.. తెలుగు పరిశ్రమకు ఒక కన్నుగా భావిస్తుంటారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలీనులు.. తెలుగు పరిశ్రమకు మకుటం లేని మహారాజులు. ఇద్దరి సినిమాల తీరు వేరు, ఇద్దరి లైఫ్ స్టైల్ వేరు. ఎన్టీఆర్ తిండి కలిగితే కండ కలదోయ్ అంటుండేవారు.. ఏఎన్నార్ మాత్రం మంచి డైట్ ను ఫాలో అయ్యేవారు. ఆ కాలంలోనే డైట్ ను మెయింటేన్ చేస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకునేవారు.
వయసు పెరుగుతున్నా కొద్ది.. ఆహార నీయమాలు పాటిస్తూ.. ఏది తినాలో.. ఏది తినకూడదో.. తెలుసుకుని పక్కాగా ఫాలో అయ్యేవారు. అందుకే ఏఎన్నార్ 90 ఏళ్లకు పైగా హ్యాపీ లైఫ్ ను లీడ్ చేశారు. అయితే అక్కినేనికి అతి పెద్ద ఆరోగ్య సమస్య ఉందని మీకు తెలుసా?
24
అక్కినేని నాగేశ్వరావు ఆరోగ్య రహస్యం..
అక్కినేని చాలా క్రమశిక్షణతో జీవితాన్ని నడిపించారు. ఆహార అలవాట్లు కానీ, వ్యాయామాల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవారు. చెడు అలవాట్లు వైపుకు కూడా ఏఎన్నార్ వెళ్లలేదు. కాని డాక్టర్ల సలహామేరకు అక్కినేని రోజుకు ఒకటీ.. రెండు పెగ్గులు ఆల్కాహాల్ మాత్రం తీసుకునేవారు. అది కూడా ఫారెన్ లో బెస్ట్ బ్రాండ్ ను వాడేవారట అక్కినేని. అది నరాలకు ఉత్తేజాన్ని ఇచ్చి నిద్రకు సహాయపడుతుందని నమ్మేవారు అక్కినేని.
అన్నింటికి మించి ఆయన ఏది మనసులోకి తీసుకునేవారు కాదు. సమస్య ఏదైనా.. చేయాల్సిన పని చేసేవారు, దాని ఫలితం పై ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం, నష్టమొస్తే కుంగిపోవడం, లాభం వస్తే పొంగిపోవడం లాంటివి చేసేవారు కాదు. అదే ఆయన ఆరోగ్య రహస్యం. ఈ అలవాటునే తన తనయుడు నాగార్జునకు అలవాటు చేశారు అక్కినేని. తన తండ్రి బాటలోనే కింగ్ నడుస్తున్నారు.
34
ఏఎన్నార్ కు ఉన్న ఆరోగ్య సమస్య..
అక్కినేని నాగేశ్వరావు అంత జాగ్రత్తగా ఉన్నా.. ఆయనకు గతంలోనే ఓ పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. 1986 లోనే ఏఎన్నార్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అప్పటికీ ఏఎన్నార్ కు 62 ఏళ్లు వచ్చినా.. హీరోగా మంచి ఫామ్ లోనే ఉన్నారు అక్కినేని. సడెన్ గా హార్ట్ ప్రాబ్లమ్ రావడంతో.. ట్రిట్మెంట్ కోసం ఫారెన్ వెళ్లారు నాగేశ్వారవు. వెంటనే డాక్టర్లు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలని చెప్పారు.
అమెరికాలో ఆపరేషన్.. హార్ట్ ఓపెన్ చేసిన తరువాత వారికి అర్ధం అయ్యింది.. రిస్క్ ఎక్కువగా ఉందని. బ్రతికే ఛాన్స్ ఉంటుందో లేదో అని అనుమానం వచ్చింది. దాంతో బైపాస్ సర్జరీ పూర్తిగా చేయకుండానే క్లోజ్ చేశారు. సర్జరీ చేయకుండా ఉంటే.. మూడేళ్లవరకూ బ్రతుకుతారు.. సర్జరీ చేస్తే మటుకు బ్రతుకుతారో లేదో నమ్మకంగా చెప్పలేము అని చెప్పారట. దాంతో కొన్నిరోజులు విశ్రాంతి తరువాత ఏఎన్నార్ ఇండియాకు వచ్చారు.
ఏఎన్నార్ బ్రతకడానికి 35 పర్సంట్ మాత్రమే అవకాశం ఉంది. గుండె మొత్తంగా 35 శాతమే పనిచేస్తుందని.. ఆయన మహాఅయితే 3 ఏళ్లు బ్రతుకుతాడని ఫారెన్ డాక్టర్లు చెప్పారు. అది కూడా 86 లో చెప్పారు. కానీ అక్కినేని మాత్రం 30 ఏళ్లు హ్యాపీగా బ్రతికి చూపించారు. అప్పటికీ క్యాన్సర్ రాకపోయి ఉంటే 100 ఏళ్లు బ్రతికి సెంచరీ కొట్టేవారు. ఆయన అంత కాలు బ్రతకడానికి ఏఎన్నార్ లైఫ్ స్టైల్ కారణం.
స్ట్రిక్ట్ గా తన డైట్ ను మార్చుకుని.. హ్యాపీగా తనకు నచ్చిన సినిమాలు చేసుకుంటూ.. ఉన్నదాంటో సంతృప్తిగా జీవించారు నాగేశ్వరావు. ఈ విషయాలను అక్కినేని నాగేశ్వరావు.. గతంలో జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వెల్లడించారు. ఇక ఏఎన్నార్ తన 90 వ ఏట.. 2014 లో క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.