
ఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం విడుదల కానున్న ప్రాజెక్టులు విభిన్న జానర్లలో ఉండడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ నుంచి మైథాలజికల్ డ్రామా వరకు ప్రేక్షకులకు పలు ఎంపికలు అందుబాటులోకి రానున్నాయి. వాటి జాబితా, రిలీజ్ డేట్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వార్ 2 (War 2)
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ “వార్ 2” ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. YRF స్పై యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం మొదటి వీకెండ్ తర్వాత కలెక్షన్లు బాగా తగ్గాయి. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం థియేటర్స్ లో రాణించలేదు. దీనితో చాలా మంది అభిమానులు ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ అక్టోబర్ 9న ఓటీటీలో రిలీజ్ కానుంది.
విడుదల తేదీ: అక్టోబర్ 9
ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్
మిరాయ్ (Mirai)
తెలుగు నటుడు తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో చిత్రం “మిరాయ్” బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం పురాణ నేపథ్యంతో, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు, విశేషమైన VFXతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మిరై OTT ప్రీమియర్‌కు సిద్ధమైంది.
విడుదల తేదీ: అక్టోబర్ 10
ఎక్కడ చూడవచ్చు: జియో హాట్‌స్టార్
కారమెలో అనే మరో చిత్రం కూడా ఓటీటీలో ఈవారం సందడి చేయబోతోంది.
కారమెలో (Caramelo)
స్పానిష్ నేపథ్యంలోని ఈ డ్రామా చిత్రంలో కుటుంబం, ప్రేమ, స్వీయ గుర్తింపు వంటి అంశాలు ఉంటాయి. ఒక శునకంతో హీరో ప్రయాణం ఎలా ఉంటుంది అనే కథాంశం ఈ చిత్రంలో చూపించారు.
విడుదల తేదీ: అక్టోబర్ 8
ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్
వెడువాన్ (Veduvan)
“కూలీ” ఫేమ్ కన్నా రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ప్రేమ, మోసం, వంటి భావోద్వేగ అంశాలను కలగలిపిన కథతో వస్తోంది.
విడుదల తేదీ: అక్టోబర్ 10
ఎక్కడ చూడవచ్చు: జీ5
కురుక్షేత్ర (Kurukshetra)
2025 నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ అనిమేటెడ్ సిరీస్‌గా రూపొందిన “కురుక్షేత్ర”, మహాభారతాన్ని 18 మంది యోధుల దృష్టికోణంలో చెప్పే వినూత్న ప్రయత్నం. యుద్ధంలో నైతిక సందిగ్ధతలను ఇది ఆవిష్కరిస్తుంది.
విడుదల తేదీ: అక్టోబర్ 10
ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్
సెర్చ్ ది నైనా మర్డర్ కేస్ (Search: The Naina Murder Case)
రహస్య హత్యా కేసును ఆధారంగా తీసుకున్న ఈ సిరీస్ థ్రిల్లర్ ప్రేమికులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
విడుదల తేదీ: అక్టోబర్ 10
ఎక్కడ చూడవచ్చు: జియో హాట్‌స్టార్
డా.సెస్సూస్ హార్టన్ (Dr Seuss’s Horton!)
పిల్లల కోసం రూపొందిన ఈ యానిమేటెడ్ సిరీస్ హృదయాన్ని హత్తుకునే సందేశంతో వస్తుంది. సో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ సిరీస్ ని చూపించవచ్చు.
విడుదల తేదీ: అక్టోబర్ 6
ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్
ట్రూ హాంటింగ్( True Haunting)
నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ హారర్ చిత్రం భయాన్ని రేకెత్తిస్తుంది.
విడుదల తేదీ: అక్టోబర్ 7
ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్
ఈజ్ ఇట్ కేక్ ? హాలోవీన్ (Is It Cake? Halloween)
హాలోవీన్ థీమ్‌తో రూపొందిన ఈ షోలో క్రియేటివ్ బేకింగ్ టాస్క్‌లు ప్రధాన ఆకర్షణ.
విడుదల తేదీ: అక్టోబర్ 8
ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్
ది రిసరెక్టెడ్ (The Resurrected)
ఈ సైకాలజికల్ థ్రిల్లర్‌లో రహస్యాలు, మోసం, పునర్జన్మ వంటి అంశాలు ప్రధానంగా ఉంటాయి.
విడుదల తేదీ: అక్టోబర్ 8
ఎక్కడ చూడవచ్చు: నెట్‌ఫ్లిక్స్
మొత్తంగా ఈ వారం పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లతో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులకు మంచి వినోదం అందించబోతున్నాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు సినిమా లవర్స్ రెండు చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ రెండు చిత్రాలలో ఒకటి వార్ 2 కాగా మరొకటి మిరాయ్. ఈ వారమే ఆ రెండు చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు కానున్నాయి.