ది విచర్ సీజన్ 4
హెన్రీ కేవిల్ స్థానంలో లియామ్ హేమ్స్‌వర్త్ రివియా గెరాల్ట్‌గా నటించిన ఈ సీజన్ “బాప్టిజం ఆఫ్ ఫైర్” నవల ఆధారంగా తెరకెక్కింది. గెరాల్ట్, సిరీ, యెన్నిఫర్ ల మధ్య సాగే సంఘర్షణ, మంత్ర శక్తులు, రాజకీయం ఈ సీజన్‌లో ప్రధాన ఆకర్షణ.
విడుదల తేదీ : అక్టోబర్ 30
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
బాలాద్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్
కోలిన్ ఫరెల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మకావ్ క్యాసినోల్లో సాగే ఒక గ్యాంబ్లింగ్ థ్రిల్లర్. ఒక ఐరిష్ కాన్ ఆర్టిస్ట్ జీవితంలో జరిగే మానసిక, ఆధ్యాత్మిక పోరాటం కథాంశం.
విడుదల తేదీ : అక్టోబర్ 29
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్
ఇడ్లీ కడై
తమిళ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం కుటుంబ విలువలు, వారసత్వం, కులతత్వం, వ్యాపార ధోరణులను చూపిస్తుంది. తండ్రి వారసత్వమైన ఐడ్లీ షాప్‌ను కాపాడే యువకుడి కథ ఇది. ఈ చిత్రంలో ధనుష్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
విడుదల తేదీ : అక్టోబర్ 29
ఎక్కడ చూడాలి : నెట్ ఫ్లిక్స్