Satan The Dark
హారర్ జానర్‌లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘Satan The Dark’. Chandini Tamilarasan కీలక పాత్రలో నటించిన ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది. ఇప్పుడు OTTలో పలుభాషల్లో విడుదల అవుతోంది.
ఎక్కడ చూడాలి: Prime Video, Aha Tamil
రిలీజ్ డేట్: మే 18
Jack Ryan: Ghost War
John Krasinski ప్రధాన పాత్రలో నటించిన ‘Jack Ryan: Ghost War’ యాక్షన్ థ్రిల్లర్‌గా రానుంది. CIA ఆపరేషన్లలో ద్రోహం, కుట్రలు, గత రహస్యాల చుట్టూ కథ తిరుగుతుంది.
ఎక్కడ చూడాలి: Prime Video
రిలీజ్ డేట్: మే 20
System
Sonakshi Sinha, Jyothika ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ‘System’. ఓ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్ట్ స్టెనోగ్రాఫర్ మధ్య ఏర్పడే అనుబంధం చుట్టూ కథ సాగుతుంది. తండ్రి-కూతురు కోర్టులో ఎదురెదురుగా నిలబడే కేసు ప్రధాన ఆకర్షణ.
ఎక్కడ చూడాలి: Prime Video
రిలీజ్ డేట్: మే 22
Married To The Game 2
ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాళ్ల భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్ జీవితాల చుట్టూ తిరిగే రియాలిటీ డాక్యుసిరీస్ ‘Married To The Game’ రెండో సీజన్ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది.
ఎక్కడ చూడాలి: Prime Video
రిలీజ్ డేట్: మే 20