రాజమౌళి సినిమాలని రీమేక్ చేస్తే అన్నీ సూపర్ హిట్లే.. అది మాత్రం ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయ్యిందో తెలుసా ?

Published : Mar 22, 2026, 08:04 PM IST

Rajamouli Movies: రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు ఇతర భాషల్లో కొన్ని రీమేక్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటి ? వాటి రిజల్ట్స్ ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడు రాజమౌళి పరాజయం లేకుండా ప్రపంచ స్థాయి దర్శకుడిగా ఎదిగారు. బాహుబలి తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న ప్రతి చిత్రం వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గతంలో రాజమౌళి తెరకెక్కించిన సినిమాలు పలు భాషల్లో రీమేక్ అయ్యాయి. రీమేక్ అయిన సినిమాలు అన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. హిట్ అయిన సినిమాలు ఏవి ? ఫ్లాప్ అయిన ఒక్క మూవీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

25
సిరుతై

విక్రమార్కుడు చిత్రానికి తమిళ రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. శివ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. హీరో కార్తీ డ్యూయెల్ రోల్ లో అదరగొట్టారు.

35
సన్నాఫ్ సర్దార్

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న చిత్రానికి ఇది రీమేక్. ఈ మూవీలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది.

45
రౌడీ రాథోడ్

ఇది కూడా విక్రమార్కుడు చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. హిందీలో ఈ చిత్రాన్ని ప్రభుదేవా తెరకెక్కించారు. అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా జంటగా నటించారు. బాలీవుడ్ లో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది.

55
ఛత్రపతి

ఒక తెలుగు హీరో సినిమాని మరో తెలుగు హీరో రీమేక్ చేయడం కాస్త ఆశ్చర్యకర విషయమే. అది కూడా దాదాపు 18 ఏళ్ళ తర్వాత. ప్రభాస్ తో రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రం 2005లో రిలీజ్ అయింది. ఈ చిత్రానికి హిందీ రీమేక్ ని వివి వినాయక్ హిందీలో 18 ఏళ్ళ తర్వాత తెరకెక్కించారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ఈ మూవీ డిజాస్టర్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories