Published : Mar 03, 2025, 08:26 AM ISTUpdated : Mar 03, 2025, 11:15 AM IST
Oscar 2025: ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల విజేతలను ప్రకటించారు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన వేడుకలో ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం సహా వివిధ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న వారి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
Oscars 2025: The complete list of winners in telugu
Oscar 2025: ప్రపంచ చలన చిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావించే ‘ఆస్కార్’ అవార్డ్స్ విజేతలను ప్రకటించారు. అంగరంగ వైభవంగా జరిగిన 97 ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్ లో గ్రాండ్ గా జరుగుతోంది.
ఈ వేడుకలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్-కీరన్ కైల్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్).. బెస్ట్ యానిమేటెడ్ మూవీ-ఫ్లో.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్-పాల్ తేజ్‌వెల్ (వికెడ్) తో పాటు పలువురు అవార్డులు గెలుపొందారు. ఇంకా ఎవరెవరు, ఏ ఏ సినిమాలు అవార్డులు వచ్చాయంటే ?
23
Oscars 2025: The complete list of winners in telugu
2025 ఆస్కార్ విజేతలు :
ఉత్తమ చిత్రం - అనోరా
ఉత్తమ నటుడు - అడ్రియన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్)
ఉత్తమ నటి - మైకీ మ్యాడిసన్ (అనోరా)
ఉత్తమ దర్శకత్వం - అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - ది బ్రూటలిస్ట్ (లాల్ క్రాలే)
ఉత్తమ సౌండ్ - డ్యూన్: పార్ట్2
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్:పార్ట్2
ఉత్తమ ఒరిజినల్ సాంగ్ - ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - ది బ్రూటలిస్ట్ (డానియల్ బ్లమ్‌బెర్గ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ - వికెడ్
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ - ఐయామ్ నాట్ ఏ రోబో
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ - నో అదర్ ల్యాండ్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ - ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
33
Oscars 2025: The complete list of winners in telugu
గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘డ్యూన్: పార్ట్2’ ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్ సొంత చేసుకున్న ‘అనూజ’ చిత్రానికి నిరాశ ఎదురైంది. ఆ కేటగిరిలో ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ ఉత్తమ లఘు చిత్రంగా అవార్డును గెలుచుకుంది.
లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న 97వ అకాడెమీ అవార్డుల వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. నటీమణులు ఫ్యాషన్ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ దుస్తుల్లో మెరిశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.