పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందర్ కి కూడా సోషల్ మీడియాలో తిప్పలు తప్పడంలేదు. మెగా స్టార్ కిడ్ కూడా డీప్‌ఫేక్ వీడియో బాధితుడిగా మారిపోయాడు. ఈ విషయంలో హైకోర్టు ను ఆశ్రయించాడు అకీరా.
ఈమధ్య సెలబ్రిటీలకు ఏఐ తిప్పలు తప్పడంలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిస్ యూజ్ చేసి.. రకరకాల డీప్‌ఫేక్ వీడియోలు, ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. సెలబ్రిటీల పరువు తీసేవిధంగా వాటిని వైరల్ చేస్తున్నారు. సినీ,రాజకీయ ప్రముఖుల తోపాటు.. స్టార్ కిడ్స్ కూడా ఇప్పుడు ఈ విషయంలో బాధితులుగా మారిపోతున్నారు. రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ ను లక్ష్యంగా చేసుకుని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయంపై కంప్లైయింట్ రావడంతో.. పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టారు.
25
కోర్డును ఆశ్రయించిన అకీరా నందన్
ఈ డీప్‌ఫేక్ వీడియోల కారణంగా తమ వ్యక్తిగత గోప్యత, భద్రతకు ముప్పు ఏర్పడిందని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు కోర్టుమెట్టు ఎక్కిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అకీరా నందన్ కూడా ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనకు సంబంధించిన కంటెంట్‌ను డీప్‌ఫేక్ వీడియోలుగా సృష్టించి అనుమతి లేకుండా ప్రచారం చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆయన కోర్టును కోరారు. అలాగే తన పేరు, వ్యక్తిగత చిత్రాలు, వీడియోలను దుర్వినియోగం చేయకుండా సంబంధిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు.
35
నేరస్తుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
అకీరా వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వ్యక్తిని కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని వేగంగా స్పందించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, నిందితుడు అకీరా నందన్ పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వినియోగించి తప్పుడు రీతిలో డీప్‌ఫేక్ కంటెంట్‌ను తయారు చేశాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా ఆయన వ్యక్తిగత గోప్యతకు , భద్రతకు ముప్పు కలిగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ చర్యలు తీవ్రమైన సైబర్ నేరాల కిందకు వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.
ఈ మధ్య కాలంలో ఏఐని ఉపయోగించి ఫేక్ ఫోటోలు, వీడియోలు సృష్టించేవారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వీడియోలను ఎక్కువగా వైరల్ చేస్తున్నారు. ఈ విషయంలో ఫిల్మ్ స్టార్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఫోటోలు, వీడియోలు అనుమతి లేకుండా ఇలా వాడినివారిపై చర్చలు తీసుకోవాలని, ఇక ముందు తమ అనుమతి లేకుండా.. ఫోటోలు, వీడియోలు వాడకుండా.. చూడాలని వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈమధ్య కాలంలో చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, అల్లు అర్జున్, కమల్ హాసన్, రజినీకాంత్ , అమితాబచ్చన్ లాంటి స్టార్స్ చాలామంది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో వారికి పాజిటీవ్ గా తీర్పు కూడా వచ్చింది.
55
అధికారుల హెచ్చరిక..
పోలీసుల ప్రకారం, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీలు , ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల పేర్లతో ఫేక్ వీడియోలు సృష్టించడం చాలా పెద్ద నేరం. ఇలాంటి పనులు చేసేవారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి అనుమానాస్పద కంటెంట్‌ను చూసిన వెంటనే షేర్ చేయకుండా.. సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఇక ఇలాంటి టెక్నాలజీ అభివృద్ధితో పాటు దాని దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలని... వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.