సిల్క్ స్మిత చనిపోయినప్పుడు హాజరైన ఏకైక స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఆయన రాక వెనుక అసలు కథ ఇదే!

First Published | Oct 23, 2024, 11:37 AM IST

సిల్క్ స్మిత దారుణ పరిస్థితుల్లో మరణించినప్పుడు ఆమెని చివరి సారిగా చూసేందుకు సినిమా సెలబ్రిటీలు ఎవరూ రాలేదట. కానీ ఒకే ఒక్క స్టార్‌ హీరో వచ్చాడట. మరి ఆయన ఎవరు?
 

సిల్క్ స్మిత ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసిన నటి. వ్యాంపు పాత్రలతో పాపులర్‌, ఐటెమ్ సాంగ్‌లతో విశేష గుర్తింపు తెచ్చుకుంది సిల్మ్ స్మిత. తనకంటూ ఓ బ్రాండ్‌ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. ఆమె నటించిన పాత్రలకు ఆ ఇమేజ్‌ని యాడ్‌ చేసింది. ఇండియన్‌ సినిమాల్లోనే ఓ అరుదైన నటిగా నిలిచింది సిల్క్ స్మిత. కేవలం 18ఏళ్ల సినిమా జీవితంలోనే ఆమె 450కిపైగా సినిమాలు చేసిందంటే ఆమె ఏ రేంజ్‌లో చిత్ర పరిశ్రమని ఊపేసిందో అర్థం చేసుకోవచ్చు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Silk Smitha

అప్పట్లో స్టార్‌ హీరోలకు దీటుగా పారితోషికం తీసుకున్న నటిగా నిలిచింది. ఆమె కాల్షీట్ల కోసం పెద్ద పెద్ద స్టార్స్ సైతం వెయిట్‌ చేయాల్సిన పరిస్థితి ఉండేదంటే అతిశయోక్తి కాదు. కటిక పేదరికంలో జన్మించిన ఆమె హైస్కూల్‌ స్టేజ్‌లోనే చదువు మానేసి ఉద్యోగం చేయాల్సి వచ్చింది.

కొన్నాళ్లకే పెళ్లి చేశారు. అప్పటికే ఆమె భర్తకి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఆ పెళ్లి తనకు ఇష్టం లేదు. పైగా వేధింపులకు గురయ్యింది. దీంతో ఆ మ్యారేజ్‌ లైఫ్‌కి గుడ్‌ బై చెప్పి చెన్నై వెళ్లిపోయింది. సినిమా అవకాశల కోసం ప్రయత్నించింది. 


తమిళ దర్శకుడు విను చక్రవర్తి.. సిల్క్ స్మిత(విజయలక్ష్మి వడ్లపాటి అసలు పేరు)ని చూసి ఆయన రూపొందించిన `వండిచక్కరం`అనే సినిమాలో బార్‌ గర్ల్ సిల్కు పాత్రని ఇచ్చాడు. అందులో తనదైన నటనతో మెప్పించింది. కానీ ఈ సినిమా చాలా రోజుల తర్వాత విడుదలైంది. కానీ అప్పటికే మలయాళంలో ఆఫర్లు వచ్చాయి. అలా మలయాళ సినిమాలతో తన కెరీర్‌ని ప్రారంభించింది.

అయితే తొలి సినిమాలో ఆమె నటించిన పాత్ర పేరునే తన పేరుగా పెట్టాడు మొదటి సినిమా దర్శకుడు. అలా విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారిపోయింది. హీరోయిన్‌గానూ మారి అనేక సినిమాలు చేసింది. వచ్చిన ఏ అవకాశాన్ని కాదనకుండా చేసుకుంటూ వచ్చింది. తక్కువ టైమ్‌లోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. 

అయితే ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ రాధాకృష్ణ బాగా నమ్మింది. తన అకౌంట్స్ అన్నీ ఆయన చేతుల్లో పెట్టింది. క్రమంలో అతను పెద్ద మోసం చేశాడు. సిల్క్ స్మితని రోడ్డు పాలు చేశాడు. ఎంత పేదరికంలో పెరిగిందో, సినిమాల్లోకి వచ్చాక అంతటి లగ్జరీ లైఫ్‌ని అనుభవించింది సిల్క్ స్మిత్‌.

కానీ రాధాకృష్ణ అనే వ్యక్తి వల్ల దారుణంగా మోసపోయింది. ఆయనకు ఆల్‌రెడీ పెళ్లి అయ్యింది. పిల్లలున్నారు. కానీ సిల్క్ స్మితని గట్టిగా వాడుకున్నారు. చివరి దశలో సినిమా ఆఫర్ల కోసం చాలా మంది మేకర్స్ వాడుకుని వదిలేశారు. ఇలా వరుసగా మోసాలు చూసింది సిల్క్ స్మిత్‌.

తాగుడుకు బానిసైందని, డిప్రెషన్‌కి గురైందని, దీంతో ఆత్మహత్యకి పాల్పడిందని అంటారు. 1996 సెప్టెంబర్‌ 23న ఆమె మరణించింది. ఆమె అంత్యక్రియలకు సినిమా వాళ్లు రాలేదని, ఎంతో మంది స్టార్‌ హీరోలు, సూపర్‌ స్టార్లు, చిన్న హీరోలతోనూ కలిసి నటించింది సిల్క్ స్మిత. కానీ ఎవరూ తనని చివరి చూపుకు రాలేదని అంటుంటారు. అయితే ఆమెని కడసారి చూసేందుకు మాత్రం ఒక్క స్టార్‌ హీరో వచ్చాడట.

ఆయన ఎవరో కాదు యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌. ఆయన మాత్రమే రావడానికి ఓ కారణం ఉంది. ఆయనతో కలిసి సిల్క్ స్మిత `అలిమయ్య` అనే సినిమా చేసింది. ఈ మూవీ సమయంలోనే తాను చనిపోతే నువ్వైనా వస్తావా? అని అడిగిందట సరదాకి. ఆ టైమ్‌లో మాటిచ్చాడట అర్జున్‌. అయితే ఇంత త్వరగా ఇలా అవుతుందని ఊహించలేదు. అందుకే ఆమె చివరి కోరిక నెరవేర్చడం కోసం తాను వచ్చినట్టు అర్జున్‌ చెప్పడం విశేషం. 

టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లిస్ట్, ప్రభాస్ సినిమాలు ఏ ప్లేస్ లో ఉన్నాయి?

Latest Videos

click me!