మెగా హీరోలకు `శృతి` సెంటిమెంట్‌.. హిట్‌ కావాలంటే ఆమె ఉండాల్సిందే.. చిరుకి అదే జరిగిందా?

Published : Jan 17, 2023, 02:23 PM ISTUpdated : Jan 17, 2023, 05:12 PM IST

మెగా ఫ్యామిలీతో పది మంది వరకు హీరోలున్నారు. వారిలో నలుగురు సూపర్‌స్టార్లుగా రాణిస్తున్నారు. అయితే ఈ నలుగురిని ఆదుకుంటుంది మాత్రం ఒకే హీరోయిన్‌ కావడం విశేషం. కష్టకాలంలో హిట్‌ ఇస్తూ నిలబెడుతుంది.   

PREV
19
మెగా హీరోలకు `శృతి` సెంటిమెంట్‌.. హిట్‌ కావాలంటే ఆమె ఉండాల్సిందే.. చిరుకి అదే జరిగిందా?

మెగా హీరోలకు లక్కీ హీరోయిన్‌గా నిలుస్తుంది ఎవరో కాదు శృతి హాసన్‌. ఆమె తాజాగా చిరంజీవికి హిట్‌ ఇచ్చింది. ఇప్పుడు మెగాస్టార్‌ జోరు మామూలుగా లేదు. సంక్రాంతి కింగ్‌గా నిలబడబోతున్నారు చిరు. ఈ సక్సెస్‌ కి శృతి హాసన్‌ సెంటిమెంట్‌ వర్కౌట్‌ కావడం విశేషం. దీంతో మెగా హీరోల పాలిట అదృష్ట దేవతలా మారిపోతుందీ సొట్టబుగ్గల సుందరి. మరి ఆ కథేంటో చూస్తే. 
 

29

శృతి హాసన్..2012లో `గబ్బర్‌ సింగ్‌`తో ఎంట్రీ ఇచ్చింది. `పులి`, `తీన్‌ మార్‌`, `పంజా` వంటి మూడు హ్యాట్రిక్‌ పరాజయాలతో డిజప్పాయింట్‌తో ఉన్న పవన్‌కి `గబ్బర్‌ సింగ్‌` రూపంలో హిట్‌ దక్కింది. హరీష్‌ శంకర్‌ రూపొందించిన చిత్రమిది. ఇందులో శృతి హాసన్‌ సెంటిమెంట్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఈ  జోడికి మంచి పేర్కొంది. ఈ సినిమాతో మెగా కాంపౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాస్‌. 
 

39

ఆ తర్వాత వరుస `సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌`తో పరాజయం అనంతరం పవన్‌తో `కాటమరాయుడు` చిత్రంలో నటించింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. కానీ పవన్‌ రాజకీయాల్లో బిజీ అనంతరం రీఎంట్రీ ఇస్తూ `వకీల్‌ సాబ్‌` చిత్రంలో నటించారు. ఇందులో శృతిని రిపీట్‌ చేశారు. ఈ సినిమా పవన్‌కి బెస్ట్ కమ్ బ్యాక్‌నిచ్చింది. పవన్‌, శృతి సెంటిమెంట్‌ బాగా వర్కౌట్‌ అయ్యింది. 
 

49

పవన్‌ తర్వాత రామ్‌చరణ్‌తో జోడీ కట్టింది శృతి హాసన్‌. `జంజీర్‌` వంటి భారీ డిజాస్టర్‌ తర్వాత చరణ్‌ `ఎవడు` చిత్రంలో నటించారు. వంశీపైడిపల్లి రూపొందించిన ఈ చిత్రంలో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. రామ్‌చరణ్‌కి హిట్‌ అయ్యింది. చరణ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ప్రయత్నం ఘోరంగా విఫలమయ్యింది. దీంతో చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. ఆ ట్రాన్స్ లో ఉన్న చెర్రీకి `ఎవడుఉ`  పెద్ద రిలీఫ్‌. అందులో హీరోయిన్‌ శృతినే కావడం విశేషం. దీంతో మెగా హీరోలకు శృతి హిట్‌ సెంటిమెంట్‌ అనే టాక్‌ ఆనాడే స్టార్ట్ అయ్యింది. 
 

59

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని కూడా ఆదుకుంది శృతి. `ఇద్దరమ్మాయిలతో` చిత్రపరాజయంతో డౌన్‌ అయ్యారు బన్నీ. అలాంటి టైమ్‌లో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో `రేసుగుర్రం` చిత్రంలో నటించారు. ఇందులో శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బంపర్‌ హిట్‌ అయ్యింది. రేసుగుర్రం లాంటి క్లైమాక్స్ సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా హిట్‌తో బన్నీ రేంజ్‌ అమాంతం పెరిగింది. ఈ రకంగానూ మెగా హీరోలకు శృతి హిట్‌ సెంటిమెంట్‌ అనేది బలంగా పడిపోయింది. 
 

69

ఆ తర్వాత పవన్‌కి `వకీల్‌ సాబ్‌`తో రెండేళ్ల క్రితం హిట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్‌ వంతు వచ్చింది. `చిరంజీవికి రీఎంట్రీ మూవీ `ఖైదీ నెంబర్‌ 150` తర్వాత ఆ స్థాయి హిట్‌  పడలేదు. `సైరా`ప్రశంసలకే పరిమితమయ్యింది. `ఆచార్య` హిస్టారికల్‌ డిజాస్టర్‌ అయ్యింది. `గాడ్‌ ఫాదర్‌` బాగుందనే టాక్‌ వచ్చినా పెద్దగా ఆడలేదు. దీంతో `వాల్తేర్‌ వీరయ్య` హిట్‌ అనేది ప్రతిష్టాత్మకంగా మారింది. ఇలాంటి ఒత్తిడి సమయంలో చిరుకి శృతి కలిసొచ్చింది. `వాల్తేర్‌ వీరయ్య` యావరేజ్‌ టాక్‌ వచ్చినా సంక్రాతి కావడంతో కలెక్షన్ల దుమ్ముదులుపుతుంది.  ఈ చిత్రం మూడు రోజుల్లోనే వంద కోట్లు దాటింది. సోమవారం కలెక్షన్లతో బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకుంటుందని సమాచారం. ఇకపై వచ్చే  కలెక్షన్లు ప్రాఫిట్‌ జోన్‌లోకి వెళ్తుందని అంటున్నారు. 
 

79

ఇందులో చిరంజీవి సరసన శృతి హాసన్‌  నటించింది. రా ఏజెంట్‌గా నటించి అదరగొట్టింది. యాక్షన్‌ కూడా చేసింది. ఏదేమైనా హిట్‌ సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తూ చిరంజీవికి బ్లాక్‌ బస్టర్‌ని అందించింది. ఈ సినిమా లాంగ్‌ రన్‌లో 150కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు వెళ్తుందని అంటున్నారు. ఇది చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా  నిలుస్తుంది చెప్పొచ్చు. ఇలా మెగా హీరోలను కష్టకాలంలో శృతి ఆదుకుంటుందని, హిట్‌ ఇచ్చి నిలబెడుతుందనే టాక్‌కి బలం చేకూరింది. ఇప్పుడు మెగా హీరోలకు శృతి లక్కీ హీరోయిన్‌గా నిలుస్తుంది. అయితే కంటెంట్‌ ఉంటేనే సినిమా హిట్‌ అవుతుందనేది నిజం. వాటికి ఇలాంటి సెంటిమెంట్లు అడిషనల్‌ యాడెడ్‌ మాత్రమే. 
 

89

ఇలా మెగా హీరోల్లో సూపర్‌ స్టార్లుగా రాణిస్తున్న చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌లతో జోడీ కట్టి విజయాల్లో భాగమైంది. మెగా హీరోలకు లక్కీ హీరోయిన్‌ అవుతుంది శృతి. 

99

శృతి హాసన్‌ ఈ సంక్రాంతికి చిరంజీవితోపాటు బాలకృష్ణతో కూడా కలిసి నటించింది. `వీరసింహారెడ్డి`లో కాసేపు మెరిసింది. హీరోయిన్‌ పాత్రనే అయినా ఆమెని గెస్ట్ రోల్‌కి పరిమితం చేశారు. దీంతో ఆమె అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అయితే ఆ సినిమాకి కూడా భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే వంద కోట్లు దాటింది. ఇది కూడా రూ.150కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందట. శృతి హాసన్‌ నెక్ట్స్ ప్రభాస్‌తో `సలార్‌` చిత్రంలో నటిస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories