Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే

Published : Sep 13, 2026, 02:21 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 10లో ఇప్పటికే షాలిని, అమన్‌ ల మధ్య లవ్‌ ట్రాక్‌ బిల్డ్ చేశారు. ఇప్పుడు కొత్తగా మరో జంట మధ్య ట్రాక్‌ని నడిపించబోతున్నారట. ఇది వర్కౌట్‌ అయితే షో బ్లాస్టే అని చెప్పొచ్చు.

PREV
14
మొదటి వారంలో ఇద్దరు ఎలిమినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 10 మొదటి వారం పూర్తి కాబోతుంది. ఆదివారంతో విజయవంతంగా ఫస్ట్ వీక్‌ కంప్లీట్‌ అవుతుంది. వీకెండ్‌లో జరగాల్సిన ఎలిమినేషన్స్ మిడ్‌ వీక్ లోనే అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా మిడ్‌ వీక్‌లోనే ఇద్దరిని ఎలిమినేట్‌ చేసిన విషయం తెలిసిందే. చరణ్‌, చైత్ర రాయ్‌లను ఇంటికి పంపించారు. వీరి ఎలిమినేషన్‌ అన్‌ ఫెయిర్‌ అని అంతా అంటున్నారు. కానీ రేటింగ్‌ కోసం హడావుడి చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఊహించని ట్విస్ట్ లు, టర్న్ లు ఉంటాయని ముందు నుంచి నాగార్జున చెబుతూ వస్తున్నారు. ప్రతిదీ 10 ఎక్స్ అని ప్రకటించారు. ఆట, గేమ్‌ అంత ఈజీ కాదని, ఎవరూ నిర్లక్ష్యంగా ఉండటానికి వీల్లేదని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారు హౌజ్‌ని వీడక తప్పడం లేదు.

24
కొత్త లవ్‌ ట్రాక్‌ బిల్డ్ చేస్తున్న బిగ్‌ బాస్‌ నిర్వాహకులు

ఈ క్రమంలో ఇప్పుడు లవ్‌ ట్రాక్‌లకు సంబంధించిన చర్చ నడుస్తోంది. కామన్‌గా బిగ్‌ బాస్‌ షోలో లవ్‌ ట్రాక్‌లను క్రియేట్‌ చేస్తారు. కొన్ని సహజంగానే జనరేట్‌ అవుతాయి. మరికొన్ని క్రియేట్‌ చేస్తుంటారు. అగ్నిపరీక్ష ద్వారా వచ్చిన కంటెస్టెంట్లతో అమన్‌, షాలిని మధ్య ఆల్రెడీ ట్రాక్‌ క్రియేట్‌ చేశారు. దాన్ని ఇప్పుడు హౌజ్‌లోనూ మెయింటేన్‌ చేయాలని, దాన్ని బాగా వాడుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో వారి నుంచి కంటెంట్‌ రావడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు మరో లవ్‌ ట్రాక్‌ని రెడీ చేస్తున్నారట. అయితే ఊహించని క్రేజీ ట్రాక్‌ని ప్రిపేర్‌ చేస్తుండటం విశేషం.

34
దేబ్జానీ, ముఖేష్‌ గౌడ మధ్య లవ్‌ ట్రాక్‌?

కొత్త లవ్‌ ట్రాక్‌ బుల్లితెర స్టార్స్ మధ్య కావడం విశేషం. ఈ సారి గ్లామర్‌ పరంగా టీవీ నుంచి దేబ్జానీ, వర్షిణి సౌందరాజన్‌ తీసుకున్నారు. వీరిని గ్లామరస్‌గా, లవ్‌ ట్రాక్‌ల పరంగా వాడుకోవచ్చు అనేది నిర్వాహకులు ప్లాన్‌. వర్షిణి నుంచి అలాంటిది ఇంకా జనరేట్‌ అయ్యే పరిస్థితి లేదు. దీంతో దేబ్జానీ రంగంలోకి దించుతున్నారట. తాజాగా ఆదివారం ఎపిసోడ్‌లో ఏకంగా హింట్‌ ఇచ్చేశారు. దేబ్జానీ ఓపెన్‌గా మరో బుల్లితెర స్టార్‌ ముఖేష్‌ గౌడపై తన ఇంట్రెస్ట్ ని వెల్లడించింది. అతని కళ్లు బాగుంటాయని నాగార్జున ప్రశంసించారు. మీరు చెబుతుంటే చాలా హ్యాపీగా ఉందన్నాడు ముఖేష్‌ గౌడ. మరి దేబ్జానీ చెబితే హ్యాపీగా ఫీలవ్వలేదా అని ప్రశ్నించాడు నాగ్.

44
ముఖేష్‌ గౌడ తనతో పులిహోర కలపడం లేదని ఓపెన్‌గా చెప్పిన దేబ్జానీ

దానికి దేబ్జానీ రియాక్ట్ అయ్యింది. నిజంగానే నీ కళ్లు బాగుంటాయనిపించింది, అందుకే చెప్పాను అని చెప్పగా, థ్యాంక్యూ నీ కళ్లు కూడా బాగుంటాయని ముఖేష్‌ గౌడ వెల్లడించారు. ఆ తర్వాత దేబ్జానీ ఓపెన్‌ అయ్యింది. ఇక్కడ తనకు ముఖేష్‌ గౌడ అంటే చాలా ఇష్టమని, కానీ వచ్చినప్పట్నుంచి చెప్పాలనుకుంటున్నా, చెప్పలేకపోతున్నాను. ఇటు సైడ్ పులిహోర చేస్తున్నాడు, అటు సైడ్‌ పులిహోర చేస్తున్నాడు, కానీ నా వద్దకు రావడం లేదు అని ఓపెన్‌గా కామెంట్ చేసింది దేబ్జానీ. దీంతో హౌజ్‌ మొత్తం అరుపులతో హోరెత్తింది. నాగార్జున కూడా ఆశ్చర్యపోయాడు. ఆదివారం ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోలో ఇది రివీల్‌ అయ్యింది. నిజంగానే వీరి మధ్య లవ్‌ ట్రాక్‌ని బిల్డ్ చేసే పనిలో ఉన్నారట. అది వర్కౌట్ అయితే బుల్లితెర మొత్తం ఆసక్తికరంగా చూస్తుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ తోపాటు యూత్‌కూడా ఈ షోని చూస్తారు. అది షో టీఆర్‌పీ రేటింగ్‌ పెరగడానికి కారణమవుతుంది. గట్టిగా వర్కౌట్‌ అయితే మాత్రం షో బ్లాస్టే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ ప్లాన్‌ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories