మహేష్‌ సినిమాలో మెయిన్‌ విలన్‌ ఆ స్టార్‌ హీరోనా?.. ఇదిగో హింట్‌.. రాజమౌళి లెక్కలు వేరే లెవల్‌

Published : Aug 05, 2024, 06:30 PM IST

మహేష్‌ బాబు, రాజమౌళి సినిమాకి సంబంధించిన వార్తలు గూస్‌బంమ్స్ తెప్పిస్తున్నాయి. తాజాగా స్టార్‌ హీరో కామెంట్స్ మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి.   

PREV
16
మహేష్‌ సినిమాలో మెయిన్‌ విలన్‌ ఆ స్టార్‌ హీరోనా?.. ఇదిగో హింట్‌.. రాజమౌళి లెక్కలు వేరే లెవల్‌

 మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. ఈ మూవీ ఎలా ఉండబోతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎవరెవరు నటిస్తారనేది సస్పెన్స్ గా మారింది. అదే ఆడియెన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తుంది. అయితే సినిమా స్టోరీ పరంగా చూస్తే ఇది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగుతుందని, మహేష్‌ బాబు ప్రపంచ సాహసికుడిగా కనిపిస్తాడని రైటర్‌ విజయేంద్రప్రసాద్ వెల్లడించారు. 

26
Mahesh Babu and Rajamouli

ఇంతకు మించి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఎలాంటి లీక్‌లు లేవు. అయితే టెక్నీషియన్లు ఇప్పటికే ఫిక్స్ అయ్యారని, ఆర్టిస్ట్ ల ఎంపిక జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ చేస్తున్నారట. మరోవైపు కొత్త లుక్‌ కోసం వర్కౌట్‌ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన సరికొత్త లుక్‌లో కనిపిస్తూ షాకిస్తున్నాడు. 
 

36

ఇదిలా ఉంటే ఇందులో కాస్టింగ్‌కి సంబంధించిన గూస్‌బంమ్స్ అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్‌ హీరో, `సలార్‌` ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలొచ్చాయి. ఇది ఆల్మోస్ట్ నిజమనే తెలుస్తుంది. ఆయనే మెయిన్‌ విలన్‌ అనే చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్‌, బ్రేకింగ్‌ న్యూస్‌ వినిపిస్తుంది. 
 

46

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ని కూడా తీసుకుంటున్నారట. ఇటీవలే ఆయనతో రాజమౌళి చర్చలు జరిపారట. అయితే ఇదే విషయంపై తాజాగా `తంగలాన్‌` టీమ్‌ మీడియా ఇంటరాక్షన్‌లో విక్రమ్‌ స్పందించారు. మహేష్‌ బాబు సినిమాలో మీరు నటిస్తున్నారని? రాజమౌళి మీతో మాట్లాడారనే వార్తలు వస్తున్నాయి. ఎంత వరకు నిజమనే ప్రశ్న ఎదురయ్యింది. దీనికి విక్రమ్‌ స్పందిస్తూ, రాజమౌళిని తాను, చాలా సందర్భాల్లో కలిశాం. కలిసి పనిచేయాలనుకున్నాం. చాలా రకాల చర్చలు జరిగాయి. భవిష్యత్‌లో పనిచేస్తాం` అని తెలిపారు. 
 

56

ఈ సందర్భంగా విక్రమ్‌ డైరెక్ట్ గా తాను నటించడం లేదని చెప్పలేదు. భవిష్యత్‌లో పనిచేస్తామన్నారు. రాజమౌళి నెక్ట్స్ సినిమా మహేష్‌తోనే. అది కాకుండా మరో సినిమా అంటే మరో మూడు, నాలుగేళ్లు పడుతుంది. అప్పటి కోసం ఇప్పుడు చర్చలు జరగడమనేది నమ్మేలా లేదు. దీంతో విక్రమ్‌ చెప్పకనే అసలు విషయం చెప్పేశాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదే సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది మున్ముందు తేలనుంది. 
 

66
Mahesh Babu and Rajamouli

అయితే మహేష్‌తో చేసేది పాన్ ఇండియా కాదు, పాన్‌ వరల్డ్ మూవీ. ఇందులో అన్ని భాషలకు చెందిన ఆర్టిస్ట్ లను తీసుకోనున్నారట రాజమౌళి. మలయాళం నుంచి పృథ్వీరాజ్‌, తమిళం నుంచి విక్రమ్.. అలాగే కన్నడ, హిందీ భాషల నుంచి, మరోవైపు విదేశీ ఆర్టిస్ట్ లను కూడా తీసుకోబోతున్నారని టాక్‌. ఇలా ఇంటర్నేషన్‌ ఫిల్మ్ గా దీన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జక్కన్న చేస్తున్నారని సమాచారం. దీన్ని సుమారు వెయ్యి కోట్లతో తెరకెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుంది. సినిమా ప్రారంభానికి సంబంధించిన క్లారిటీ లేదు. ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories