Bhumika Chawla
సినిమాల్లో ఎప్పుడు ఎవరికి లైఫ్ వస్తుందో ఊహించలేం. ఒక్క సినిమా అందరు జీవితాలను మార్చేస్తుంది. ఒక్క సక్సెస్ ఓవర్ నైట్‌లో స్టార్‌ని చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మ్యాజిక్. ఒక్క సినిమాతో ఎంతో మంది స్టార్ అయినవాళ్లు ఉన్నారు, అదే ఒక్క సినిమాతో అడ్రస్ లేకుండా పోయిన వాళ్లూ ఉన్నారు. ఏది ఎప్పుడు జరుగుతుందో ఊహించలేం. ఎవరు ఎప్పుడూ వస్తారో, ఇండస్ట్రీని దున్నేస్తారో అస్సలు ఊహించలేం. ఇది అంతా మాయా ప్రపంచం.
ఇక హీరోయిన్ భూమిక పదేళ్ల క్రితం వరకు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇరవై ఏళ్ల క్రితం టాలీవుడ్‌ని ఊపేస్తున్న హీరోయిన్‌గా నిలిచింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో కెరీర్ పరంగా పీక్ స్టేజ్‌ని అనుభవిస్తుంది. `ఖుషి`, `ఒక్కడు`, `సింహాద్రి`, `మిస్సమ్మ` చిత్రాల హిట్లతో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ప్రారంభంలో భూమిక నిర్ణయం ఓ హీరోయిన్‌కి లైఫ్ ఇవ్వడమే కాదు స్టార్ హీరోయిన్‌ని చేసింది.
భూమిక `యువకుడు` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. వరుస ఆఫర్లు అందుకుంది. ఆమెకి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వెంకటేష్ వంటి వారితో కలిసి నటించే అవకాశాలు వచ్చాయి. వరుసగా స్టార్ హీరోల సినిమా ఆఫర్లు రావడంతో ఆమె బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తాను ఓ బ్లాక్ బస్టర్ మూవీని వదులుకుంది. దీంతో అది మరో హీరోయిన్‌కి లైఫ్ ఇచ్చింది. ఆమెని స్టార్ హీరోయిన్‌ని చేసింది. ఆ సంగతులేంటో చూస్తే..
వెంకటేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ `నువ్వు నాకు నచ్చావ్`. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్, స్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ సినిమా ద్వారా ఆర్తి అగర్వాల్‌ని హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేశారు. ఈ సినిమా హిట్ కావడంతో ఆర్తి అగర్వాల్ స్టార్ అయిపోయింది. ఇండస్ట్రీలో హాట్ కేక్‌లా మారింది. దీంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా దూసుకుపోయింది.
అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్‌గా భూమికని అనుకున్నారట. ఆమెని సంప్రదించారు. మొదట ఓకే అనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదట. భూమిక బిజీగా ఉండటం, సరైన కమ్యూనికేషన్ లేకపోవడమా కారణాలేదైనా భూమిక ఈ మూవీ చేయలేకపోయిందట. దీంతో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. ఇదే స్క్రిప్ట్ ని బాలీవుడ్‌లోనూ తీయాలని ప్లాన్ చేశారు విజయభాస్కర్. దానికోసం ముంబయి వెళ్లి అక్కడ ఓ నిర్మాణని కలిశారట. అప్పుడే వాళ్లు ఆర్తి అగర్వాల్‌ని పరిచయంచేస్తూ ఓ(పాగల్ పన్) సినిమా చేస్తున్నారు. అందులో ఆర్తి ఫోటోలు చూస్తే బాగా అనిపించింది. స్క్రీన్ లుక్ కోసం ఆమె వీడియో క్యాసెట్లు తెప్పించుకుని చూశారట. ఓకే `నువ్వు నాకు నచ్చావ్`లో నందిని పాత్రకి బాగా సెట్ అవుతుందని డిసైడ్ అయ్యారట. మరో ఆలోచన లేకుండా ఆమెని ఇండియాకి రప్పించారు.
అప్పటికీ ఆర్తికి పెద్దగా యాక్టింగ్‌పై అవగాహన లేదు. కానీ చెప్పినట్టు చేస్తుంది. దీంతో ఆమెని ట్రైన్ చేసి, వెంకీ సైతం స్పెషల్ కేర్ తీసుకుని ఆర్తిని ట్రైన్ చేసి ఆ సినిమా చేశారట. చాలా అద్భుతంగా చేసిందని, ఆమె పాత్ర సినిమాకి హైలైట్ అయ్యిందని చెప్పారు దర్శకుడు విజయ భాస్కర్.. రాజేష్ మన్నె(తెరవెనుక కథలు) ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్తిపై ప్రశంసలు కురిపించారు. చెప్పినదానికంటే బెటర్‌గా చేసి తమని సర్‌ప్రైజ్ చేసిందన్నారు.
ఇక `నవ్వు నాకు నచ్చావ్` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్‌కి బ్యాక్ టూ బ్యాక్ `నువ్వు లేక నేను లేను`, `అల్లరి రాముడు`, `ఇంద్ర`, `నీ స్నేహం`, `బాబీ`, `పల్నాటి బ్రహ్మనాయుడు`, `వసంతం`, `వీడే`, `నేనున్నాను`, `సంక్రాంతి`, `సోగ్గాడు`, `అందాల రాముడు`, `గోరింటాకు` వంటి చిత్రాలు పడ్డాయి. వెంకీతోపాటు చిరు, బాలయ్య, నాగ్, రవితేజ, తరున్ వంటి స్టార్స్ తో కలిసి నటించి ఓ ఊపు ఊపేసింది.
తరుణ్‌తో ప్రేమాయణం ఆమె కెరీర్‌ని దెబ్బ తీసింది. ఆయనతో లవ్ బ్రేకప్ తర్వాత కుంగిపోయింది. దీంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఆ తర్వాత డిప్రెషన్‌లోకి వెళ్లింది. బాడీ ఫిట్‌నెస్ కోసం సర్జరీలు చేయించుకుంది, కానీ అవి వికటించాయి. అనారోగ్య సమస్యలు వచ్చాయి. చివరికి గుండెపోటుతో ఆమె కన్నుమూసింది. ఆర్తి అగర్వాల్ జర్నీ ఇన్‌స్పైరింగ్‌గా సాగడం ఓ ఎత్తైతే, విషాదంగా ముగియడం అత్యంత బాధాకరమైన విషయమని చెప్పొచ్చు.